https://oktelugu.com/

Jyoti Roy : ఆ విషయంలో దయచేసి ఓపిక పట్టండి.. ఫ్యాన్స్ ని వేడుకున్న సీరియల్ నటి జ్యోతి రాయ్

ప్రస్తుతం జ్యోతి రాయ్ ప్రెట్టి గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నో మోర్ సీక్రెట్స్ నుంచి ఓ పిక్ షేర్ చేసింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 6, 2024 / 07:58 PM IST
    Follow us on

    Jyoti Roy : గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్ర చేసిన జ్యోతి రాయ్ నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. కొడుకు ప్రేమ కోసం తపించే తల్లిగా అద్భుతంగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతి రాయ్ కన్నడ నటి. కెరీర్ స్టార్టింగ్ లో కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది. ముఖ్యంగా తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది.

    సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసిందని సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం అందాలు ఆరబోస్తూ జ్యోతి రాయ్ రచ్చ చేస్తుంది. హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తుంది. ఈ బ్యూటీ గ్లామరస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం జ్యోతి రాయ్ ప్రెట్టి గర్ల్, నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నో మోర్ సీక్రెట్స్ నుంచి ఓ పిక్ షేర్ చేసింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా ప్రెట్టి గర్ల్ వెబ్ సిరీస్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చింది. తన పాత్ర గురించి తెలియజేసింది. ‘ అతి త్వరలోనే భయంకరమైన, విచిత్రమైన, కఠినమైన, గ్లామర్ డోస్ తో కూడిన బ్లడ్ బాత్ థ్రిల్లర్ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. సిరీస్ గ్లింప్స్ సరైన సమయంలో రానుంది. దయ చేసి ఆ విషయంలో ఓపిక పట్టండి’ అంటూ జ్యోతి రాయ్ తెలిపింది.

    అంతే కాదు ఈ లవ్లీ మల్టీలేయర్డ్ క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేసిన చేసిన టీంకు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ పాత్రలో తనను తాను డిఫరెంట్ గా చూపించుకోవడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాను అని చెప్పింది. మీరూ త్వరలోనే దీన్ని ఇష్టపడతారని ఆశిస్తుస్తున్నాం అంటూ రాసుకొచ్చింది జ్యోతి రాయ్. జ్యోతి రాయ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.