PKSDT Bro Movie Motion Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ చిత్రం లోని ముఖ్యమైన లైన్ ని తీసుకొని ఈ చిత్రాన్ని ఇక్కడ తెరకెక్కించారు. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.
కాసేపటి క్రితమే విడుదలైన ఈ టైటిల్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.స్టైలిష్ లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం పై అభిమానుల్లో పెద్దగా అంచనాలు లేవు,కానీ ఎప్పుడైతే ఈ పోస్టర్ వచ్చిందో, ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంది.
ముఖ్యంగా మోషన్ పోస్టర్ లో సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఎవ్వరూ ఊహించని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది .శివ స్త్రోత్తం తో ‘బ్రో’ అంటూ వచ్చే ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
వకీల్ సాబ్ సినిమా నుండి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో థమన్ మ్యూజిక్ కూడా ఒకటి. కచ్చితంగా ఈ ‘బ్రో’ చిత్రానికి కూడా ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ లో ఇచ్చి ఉంటాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్ . ఈ చిత్రం జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
Working with my Guru @PawanKalyan mama is a BIG BIG DREAM come true.
And now I’m super excited and blessed at this amazing opportunity.
( The fanboy in me is dancing like crazy)Happy to present you all the Title & Motion Poster of our #BroTheAvatar
– https://t.co/gPRBsIhWZT… pic.twitter.com/ecuPzITz83— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 18, 2023