Tollywood Producers to Stop Shootings: ‘ఓటీటీ’ టాలీవుడ్ కి ఊహించని ఉపద్రవం గా మారిందా ?, మరోపక్క నిర్మాణ వ్యయం పెరిగింది. దీనికితోడు సినీ కార్మికులు వేతనాలు పెంచుకుంటూ పోతున్నారు. మధ్యలో హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు నిర్మాతలను నిలువు దోపిడీ చేస్తున్నారు. చివరకు నిర్మాతలు అప్పుల ఊబిలో నలిగిపోతున్నారు. అందుకే.. తాజాగా నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 2, 3 నెలలపాటు షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు.
నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీకి మనుగడ లేదని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి కరోనా తర్వాత థియేటర్ల పరిస్థితి బాగా దిగజారిపోయింది. ముఖ్యంగా చిన్న సినిమాల నష్టాలు.. టాలీవుడ్ ను వణికిస్తోంది. ఇప్పటికే అనేక మంది కొత్త నిర్మాతలు, బయ్యర్లు కుదేలయ్యారు. దాంతో సినిమా పరిశ్రమ ఆదాయం కూడా సగానికి పడిపోయింది. దశాబ్దాలుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న బడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా గతంలో ఎన్నడూ లేని నష్టాలను చూశారు.
Also Read: Viral Video: సైనికుడి పాదాలకు వందనం.. వైరల్ అవుతున్న చిన్నారి వినయం
కొంతమంది బయ్యర్లు ఉన్నదంతా కోల్పోయి రోడ్డున పడ్డారు. ఉదాహరణకు ‘ఆచార్య’ బయ్యర్లు పరిస్థితి ఇప్పుడు అదే. ‘ఆచార్య టీమ్’ కొంతమేర వారిని ఆదుకునే ప్రయత్నం చేసినా… పూర్తి స్థాయిలో వారి కష్టాలైతే తీరలేదు. మరోపక్క 40 శాతం ఆక్యుపెన్సీ కూడా థియేటర్స్ లో ఉండటం లేదు. ‘రామ్’ లాంటి మీడియం రేంజ్ హీరో సినిమా ‘వారియర్’ కి మొదటి రోజు 30 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే దక్కింది. కానీ, సినిమాకి అయిన బడ్జెట్ 35 కోట్లు.
ఇప్పుడు సినిమాకి వస్తున్న కలెక్షన్స్ 20 కోట్లు దాటేలా లేదు. క్రేజ్ ఉన్న హీరో సినిమాకే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే.. ఇక కొత్త హీరోలు, చిన్న హీరోల స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలు 50 శాతం సీట్లతో బొమ్మ వేసినా పెద్దగా మిగిలేది ఏమి ఉండదు. అందుకే.. ఇలా అయితే సినీ నిర్మాణం వర్కౌట్ కాదు అని నిర్మాతలు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అందులో భాగంగా.. నిర్మాణ వ్యయం తగ్గించాలని, అలాగే, 50 రోజుల తర్వాతే ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయాలని షరతులు పెట్టుకున్నారు. పెద్ద హీరోల సినిమాలను అయితే పది వారాల తర్వాతే ఓటీటీల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. సినీ కార్మికుల వేతనాలను కూడా తగ్గించనున్నారు. దీనికి వారు ఒప్పుకోకపోతే రెండు, మూడు నెలలు పాటు షూటింగ్స్ ను కూడా బంద్ చేయనున్నారు. టాలీవుడ్ నిర్మాతలు ఈ సారి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.
Also Read:Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్