Senior Telugu Heroes Box Office Collections: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియా పరిధిలో మనవాళ్లు సాధిస్తున్న విజయాలు అంతా ఇంతా కాదు. ఒక సినిమాను మించి మరొక సినిమాతో సక్సెస్ లను సాధిస్తున్న మన హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలైతే ఒకప్పుడు వాళ్లకున్న క్రేజ్ ను వాడుకుంటూ ఈ జనరేషన్ లో ఉన్న యూత్ ని సైతం అట్రాక్ట్ చేసే విధంగా సినిమాలను చేస్తున్నారు. వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను మైమరిపింపజేయడమే కాకుండా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు. స్టార్ హీరోలు ఇండియాలో వేల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుంటే సీనియర్ హీరోలు మాత్రం తెలుగు ఇండస్ట్రీకే పరిమితమై వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు…
Also Read: ఏ క్షణమైనా యుద్ధం నేపద్యంలో మోడీ ఇజ్రాయిల్ సాహస యాత్ర
నిజానికి ఒక సీనియర్ హీరో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధిస్తే వాళ్లకు వచ్చే కలెక్షన్స్ ఎంత అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో విక్టరీ వెంకటేష్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాడు. ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇక ఈ సంవత్సరం చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు.
నిజానికైతే సీనియర్ హీరోలు బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను కొల్లగొట్టిన వాళ్ల సినిమాలకు వచ్చే కలెక్షన్స్ 400 కోట్లు మాత్రమే అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది… ఇక నాగార్జున, బాలకృష్ణ సైతం 200 కోట్ల మార్కును టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాలయ్య వరుసగా నాలుగు విజయాలను సాధించాడు.
కానీ ‘అఖండ 2’ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ నుంచి వస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయనే ధోరణిలోనే ప్రతి ఒక్కరిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి… చూడాలి మరి సీనియర్ హీరోలు ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలు చేసి వాళ్ళ మార్కెట్ ను ఇంకా పెంచుకుంటారా..? లేదంటే ప్లాప్ సినిమాలతో క్రేజ్ ను తగ్గించుకుంటారా అనేది…