Senior Hero Suman
Senior Hero Suman: హీరో గా ఒకప్పుడు ఇండస్ట్రీ లో నెంబర్ 1 రేస్ లోకి దూసుకొచ్చిన నటుడు సుమన్. అప్పట్లో ఈయన మెగాస్టార్ చిరంజీవి కి పోటీగా ఉండేవాడు, ఆయన సినిమాలకు ధీటుగా సుమన్ సినిమాలు పోటీ పడేవి. అయితే ఆ తర్వాత సుమన్ కొన్ని అనుకోని పరిస్థితుల కారణం గా అరెస్ట్ అవ్వడం తో ఆయన కెరీర్ మొత్తం నాశనం అయ్యింది.
రీ ఎంట్రీ తర్వాత పలు సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీనితో ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మారాడు. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకీ అవకాశాలు ఫుల్లుగా వచ్చాయి. సౌత్ లోనే బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆ తర్వాత ఆయన విలన్ గా కూడా బాగా రాణించాడు. ఇప్పుడు ఆయన రాజకీయ అరంగేట్రం చెయ్యడానికి అన్నీ విధాలుగా సిద్ధం అయ్యాడు.
రీసెంట్ గా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం , కోమటితిప్ప గ్రామం లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడి కాపు సామజికవర్గ కాపునాడు అద్యక్ష్యుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ సుమన్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో హాజరయ్యాడు. తానూ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని, నాకు BRS పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చాయని, నా మద్దత్తు ఆ పార్టీకే అంటూ సుమన్ ఈ సందర్భంగా తెలిపాడు.
సుమన్ ఇది వరకు జరిగిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో పవన్ కళ్యాణ్ కి చాలా సపోర్ట్ గా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన BRS కి సపోర్ట్ చేస్తున్నాను అనేలోపు ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి కూడా భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సుమన్, రాజకీయ నాయకుడిగా కూడా రాణిస్తాడో లేదో చూడాలి.