Hero Rajasekhar Injured: సీనియర్ హీరో రాజశేఖర్(Dr Rajashekar) కి నిన్న షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయం లో ఆయన కాళ్లకు తీవ్రమైన గాయాలు అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మూవీ యూనిట్ వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించి శస్త్ర చికిత్స అందించారు. చికిత్స విజయవంతంగా పూర్తి అయ్యిందని, త్వరలోనే రాజశేఖర్ పూర్తి స్థాయిలో కోలుకుంటాడు కానీ కాస్త విశ్రాంతి అవసరం ఉందని డాక్టర్లు చెప్పినట్టు రాజశేఖర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. హీరో గా తన కెరీర్ కి దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టిన రాజశేఖర్ , ఇక నుండి క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో భాగంగా వరుసగా ఆయన సినిమాలను ఒప్పుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’ చిత్రం లో విలన్ గా నటిస్తున్న రాజశేఖర్, శర్వానంద్ ‘బైకర్’ మూవీ లో హీరో కి తండ్రి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు.
క్యారక్టర్ రోల్స్ కూడా ఆయన రొటీన్ రేంజ్ లో ఉంటే అంగీకరించడం లేదట. తన నటనకు ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకుంటున్నాడట. విలన్ క్యారెక్టర్స్ చేయడానికి ఆయన 5 ఏళ్ళ ముందే రెడీ అట కానీ, ఆయన వద్దకు వస్తున్న కథలన్నీ రొటీన్ విలన్ క్యారెక్టర్స్ అని, అందుకే ఒప్పుకోవడం లేదని చెప్పాడు . అలాంటి రాజశేఖర్ ఇప్పుడు రౌడీ జనార్దన్ లో విలన్ క్యారక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడంటే, ఆయన క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. నిన్న ఆయనకు తీవ్రమైన గాయాలైన సినిమా షూటింగ్ కూడా ‘రౌడీ జనార్దన్; కి సంబంధించినదే అని అంటున్నారు. దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. ఈ రెండు చిత్రాలతో పాటు గోపీచంద్ హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ లో కూడా రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. హీరో గా మూడు దశాబ్దాల నుండి తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన రాజశేఖర్ ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఏ మేరకు నేటి తరం ఆడియన్స్ ని అలరిస్తాడో చూడాలి.