Annadammula Anubandham: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే ఎంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. సినిమానే శ్వాసగా, ధ్యాస గా బ్రతికిన వాళ్లకు మాత్రమే ఇక్కడ సక్సెస్ లు వరిస్తాయి. అంతే తప్ప టైం పాస్ కోసం సినిమాలను చేస్తాం అంటే మాత్రం కుదరదు. ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎవ్వరు ఏ పొజిషన్లో ఉంటారో చెప్పడం చాలా కష్టం. ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిపోయిన వాళ్ళు సైతం ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ వస్తోంది…అలాంటి సక్సెస్ లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు టాప్ లోకి వెళ్తారు. అలాగే వాళ్లకు క్రేజ్ కూడా పెరుగుతోంది. భారీ మార్కెట్ కూడా క్రియేట్ అవుతోంది. తెలుగు తెర మీద సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో గొప్ప సినిమాలను చేశాడు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలను చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అంటూ చాలా మంది ప్రేక్షకులు ఆయన మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తుంటారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు సైతం తనకి అభిమానిగా మారిపోయాడు. ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ సైతం తన మొదటి సినిమాను వాళ్ల నాన్న ఆధ్వర్యంలోనే చేశాడు. ‘అన్నదమ్ముల అనుబంధం ‘ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడిగా బాలయ్య బాబు నటించడం విశేషం…
ఇక ఈ సినిమాకి ఎస్డి లాల్ దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే… అయితే బాలయ్య బాబుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేసే క్రమంలో డైరెక్టర్ లాల్ కి ఆరోగ్యం బాలేకపోతే కొన్ని సన్నివేశాలను ఎన్టీఆర్ తెరకెక్కించారట. ఇక ఇదే సందర్భంలో బాలయ్య బాబు ఎన్టీఆర్ చెప్పిన సీన్ లో సరిగ్గా నటించకపోతే ఎన్టీఆర్ అక్కడే బాలయ్యను మందలించి నెత్తి మీద రెండు మొట్టికాయలు వేశాడట.
మొత్తానికైతే అతని చేత ఆ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా చేయించారట. ఆ క్షణానికి ఎన్టీఆర్ ఆ సినిమా మొత్తానికి దర్శకుడిగా వ్యవహరించారట. ఇక లాల్ మూడు రోజుల పాటు అనారోగ్యంతో సెట్ కి రాకపోవడంతో ఎన్టీఆర్ దర్శకత్వం చేశాడు. అలాగే బాలయ్య కి మొట్టికాయలు వేసిన ఏకైక దర్శకుడు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే కావడం విశేషం…
ఇక మూవీ షూట్ ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఆ షెడ్యూల్ మొత్తాన్ని కంప్లీట్ చేశారట. ఆ ఎపిసోడ్ మొత్తం బాలయ్య బాబు మీదే ఉండడం వల్ల సీనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మరి బాలయ్య బాబు చేత ఆ క్యారెక్టర్ని గొప్పగా నటించేలా చేశాడట. మొత్తానికైతే ఆ సినిమాలో నటించినందుకు బాలయ్య బాబుకు మంచి గుర్తింపైతే వచ్చింది…