Senior Actress Raasi: సీనియర్ హీరోయిన్ రాశి తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది. రాశికి ఇప్పటికీ లవ్ లెటర్స్ వస్తున్నాయట. ఆ విషయం ఆఫ్ ది రికార్డ్ సిగ్గుపడుతూ చెప్పింది రాశి. ఆ లెటర్స్ చూసుకున్నప్పుడు తనకు నవ్వు వస్తోందని.. పెళ్లి అయి కూతురు పుట్టినా తనను ఇంకా ఎంతోమంది ఇష్టపడుతుండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని రాశి తెగ ఇదైపోతూ చెబుతుంది.

అలాగే, రాశి ఈ సందర్భంగా మిగిలిన అంశాల పై కూడా తన మనసులోని ముచ్చట్లును చెప్పింది. మరి ఆ ముచ్చట్లు ఏమిటో రాశి మాటల్లోనే విందాం. ‘హీరోయిన్లకు కాస్త వయసు పైబడితే చాలు.. వెంటనే, సీనియర్ హీరోయిన్ అనే బిరుదు ఇస్తారు. పైగా సినిమాల్లో కూడా వదిన, అక్క, అమ్మ పాత్రలను మాత్రమే ఆఫర్ చేస్తారు. ఇది కరెక్ట్ అని ఎప్పటి నుంచో మేకర్స్ లో ఒక బలమైన ఆలోచన ఉండిపోయింది.
Also Read: షాకింగ్ : ప్రముఖ సినీ రచయిత మృతి
కానీ, నిజానికి అది పూర్తిగా తప్పు. నాకు అయితే అలాంటి పాత్రలు పోషించాలని అసలు లేదు. కానీ, కొన్నిసార్లు సినిమాలను వదులుకోలేం కదా. అందుకే.. తల్లి పాత్రల్లోనూ నటిస్తున్నాను. నేను ఇంకా మంచి పాత్రలను, అవసరం అనుకుంటే ఇంకా మెయిన్ లీడ్ పాత్రలను సమర్ధవంతంగా పోషించగలను. ఆ మధ్య నా దగ్గరకు ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అది బోల్డ్ వెబ్ సిరీస్. వినగానే నచ్చేసింది.
ఇంతకీ కథ ఏమిటో తెలుసా ? భర్తకి దూరం అయిన ఓ స్త్రీకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కారణంగా ఆమె చిన్న పొరపాటు చేస్తే.. ఆ పొరపాటును చూపించి చుట్టూ ఉన్న జనం ఆమెను ఎన్ని రకాలుగా వాడుకుంటారో చెప్పే కథ అది. ఈ కథలో నాకు ఎమోషన్ కనిపించింది. అందుకే .. ఈ కథతో వచ్చే వెబ్ సిరీస్ లో నటించబోతున్నాను. నాకు అంత బాగా నచ్చింది ఆ కథ.

నాకైతే నేటికీ ఆసక్తికరంగా, కొత్తగా ఉండే పాత్రలు చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది’ అంటూ రాశి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పుకుంటూ పోయింది. మరి రాశి మనసులోని కోరికలను విన్నారు కాబట్టి.. ఇక నుండైనా రాశి కోసం రచయితలు దర్శకులు కొత్త కొత్త విభిన్న పాత్రలను రాస్తారేమో చూడాలి. అన్నట్టు రాశికి నిర్మాణం పై కూడా బాగా ఆసక్తి ఉందట. పైగా గతంలో రాశి పలు చిత్రాలను నిర్మించింది కూడా. కాకపోతే, అవి పెద్దగా సక్సెస్ కాలేదు అనుకోండి.
Also Read: చీటింగ్ కేసు పై బెల్లంకొండ రియాక్షన్.. వాళ్లకు నరకం చూపిస్తాను