Senior Actress Poojitha: తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి ఇతర భాషలకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుకోవడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాతోనే. అప్పట్లో మన తెలుగు సినిమా మార్కెట్ పట్టుమని 30 కోట్ల రూపాయిలు కూడా లేదు. అలాంటి సమయం లో నిర్మాత అల్లు అరవింద్ చేత 45 కోట్ల రూపాయిలు ఖర్చు చేయించి, ఈ వెండితెర దృశ్యకావ్యాన్ని తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా సుమారుగా 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని నెంబర్ 1 హీరోల రేస్ లో నిలబెట్టింది ఈ సినిమా.కేవలం రెండవ సినిమాతోనే రామ్ చరణ్ ‘కాల భైరవ’ లాంటి పవర్ ఫుల్ యోధుడి పాత్రలో నటించాడంటే ఆయన టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా ఉనికిని ప్రపంచం మొత్తానికి చాటిన ఈ సినిమా ని చెత్త సినిమా అంటూ ఒక ప్రముఖ నటి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఆ నటి మరెవరో కాదు సీనియర్ నటి పూజిత. ఈమె తెలుగు , హిందీ , మలయాళం మరియు కన్నడ భాషలకు కలుపుకొని 138 సినిమాల్లో హీరోయిన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించింది.రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన ‘ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్’ అనే చిత్రం లో పూజిత హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యినప్పటికీ కూడా ఆమెకి పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కలేదు.ఆ తర్వాత ఆమె క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో చేసింది.అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో నేటి తరం హీరోల గురించి మాట్లాడుతూ, రామ్ చరణ్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ నాకు రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ మరియు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.రామ్ చరణ్ రంగస్థలం లో చిత్రం లో చాలా అద్భుతంగా నటించాడు, కానీ ఆయన చేసిన మగధీర చిత్రం మాత్రం నాకు అసలు నచ్చలేదు,అది ఒక వేస్ట్ సినిమాలాగే అప్పట్లో అనిపించింది.రామ్ చరణ్ లోని పరిపూర్ణ నటుడు కూడా బయటపడింది ‘రంగస్థలం’ సినిమాతోనే’ అంటూ చెప్పుకొచ్చింది పూజిత.