Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ ఫాదర్ గా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటిస్తున్నాడు. అంటే సీఎం పాత్రలో విజయ్ చందర్ కనిపించబోతున్నాడు. ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది.

నిజానికి మెగాస్టార్(Megastar Chiranjeevi) చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా ఇది, అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
అందులో భాగంగానే చిరు లుక్స్ ను పూర్తిగా మార్చబోతున్నాడు. ఎలాగూ కథ ప్రకారం మెగాస్టార్ పంచె కట్టుతో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించాలి. చిరు గానీ ఆ లుక్ లో కనిపిస్తే.. ఇక బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం. అలాగే రెండో గెటప్ కి వస్తే.. డాన్ లుక్ లో ఫుల్ గడ్డంతో చిరు చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ లుక్ చిరు కెరీర్ లోనే ప్రత్యేకమైన గెటప్ గా నిలిచిపోతుందట.
కాకపోతే డాన్ గెటప్ పది నిముషాలు మాత్రమే ఉంటుంది. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో చాలా పాత్రలను యాడ్ చేశారు.
ఆ పాత్రల్లో హీరోయిన్ పాత్ర కూడా ఒకటి. ఈ సినిమాలో చిరుకి హీరోయిన్ గా నయనాతర నటించబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మోషన్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.