Homeఎంటర్టైన్మెంట్Sekhar Master: శేఖర్ మాస్టర్ అసభ్యకర స్టెప్స్ వెనుక అసలు కథ ఇదే, హీరో కూడా...

Sekhar Master: శేఖర్ మాస్టర్ అసభ్యకర స్టెప్స్ వెనుక అసలు కథ ఇదే, హీరో కూడా బాధ్యుడే!

Sekhar Master: శేఖర్ మాస్టర్ టాలీవుడ్ నెంబర్ వన్ కొరియోగ్రాఫర్. స్టార్ హీరోల చిత్రాలకు ఆయన పని చేస్తారు. కాగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాన్సులో కొత్తదనం లేదు. అన్ని సినిమాల్లో అదే రకం స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడని నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. అంతకు మించి ఆయన కంపోజ్ చేసిన కొన్ని స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయంటూ జనాలు మండిపడుతున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీలోని ఓ సాంగ్ లో హీరో రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీతో వేసిన స్టెప్స్ వివాదాస్పదం అయ్యింది. ఆ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Also Read: ఆ స్టార్ సింగర్ భర్త సమంతను అంతలా చూసుకున్నాడా? ఓపెన్ అయిన స్టార్ లేడీ

డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణతో వేయించిన మరో స్టెప్స్ మరింత విమర్శలపాలైంది. ఊర్వశి రాతెలా హిప్ పై గుద్దడంతో పాటు బాలయ్య హ్యాండ్ మూమెంట్స్ జుగుప్సాకరంగా ఉన్నాయి. రాబిన్ హుడ్ మూవీలో కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో వేసిన మూమెంట్ సైతం అసభ్యకరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అసభ్యకర స్టెప్స్ కి శేఖర్ మాస్టర్ కేరాఫ్ అడ్రస్ అయ్యాడంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ విమర్శలపై శేఖర్ మాస్టర్ తాజాగా స్పందించారు. అందుకు తాను మాత్రమే బాధ్యుడు కాదన్నట్లు ఆయన మాట్లాడారు.

ఒక స్టెప్ విషయంలో పూర్తి నిర్ణయం నాది కాదు. హీరో, డైరెక్టర్, నిర్మాత, టీం అంతా కలిసి నిర్ణయం తీసుకుంటాము. నేను మూడు నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. అందులో వారు ఒకటి ఎంచుకుంటారు. హీరోలు, దర్శకులు ఏం కోరుకుంటారో అదే నేను ఇస్తాను.. అని శేఖర్ మాస్టర్ అన్నారు. అసభ్యకర స్టెప్స్ ఎంపికలో హీరోలకు, దర్శక నిర్మాతలకు కూడా భాగం ఉందని శేఖర్ మాస్టర్ పరోక్షంగా వెల్లడించారు.

జానూ లిరి అనే మహిళా డాన్సర్ తో తనకు అక్రమ సంబంధం అంతగంటారంటూ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె డాన్స్ నచ్చి మెచ్చుకున్నాను. దాంతో ఆమెతో నాకు లింక్ పెట్టి మాట్లాడారు. ఆ కామెంట్స్ నన్ను ఎంతగానో బాధించాయి. నా వలనే ఆమె గెలిచింది అన్నారు. ఆ షో అయ్యాక ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇతర టాప్ కొరియోగ్రాఫర్ తో నాకు విబేధాలు ఉన్నాయన్న వార్తల్లో కూడా నిజం లేదని శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ చాలా కాలంగా టెలివిజన్ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ.. తట్టుకోగలమా..?

RELATED ARTICLES

Most Popular