Shekar Kammula : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలు కాకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలను చేసి ప్రతి ప్రేక్షకుడి మన్నన్నలను పొందే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన సినిమాలు చాలా సాఫ్ట్ గా ఉంటూనే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. యూత్ లో కూడా ఆయనంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. శేఖర్ కమ్ముల(Shekar Kammula) ప్రస్తుతం ధనుష్ (Dhanush)ను హీరోగా పెట్టి ‘కుబేర ‘ (Kubera) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కూడా కీలక పాత్ర వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో రష్మిక మందన (Rashmika Mandana) హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక శేఖర్ కమ్ముల కుబేర సినిమా గురించి కొన్ని విశేషాలైతే పంచుకున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఈ సినిమా స్టోరీ రాసుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమా కథకి ధనుష్ అయితే బాగా సెట్ అవుతారని అతనితో మాట్లాడాలని అనుకున్నారట…అలాగే బిచ్చగాడి క్యారెక్టర్ గురించి ఎక్స్ ప్లెయిన్ చేయాలనుకున్నాడట…అయితే ఫోన్ చేసినప్పుడు ధనుష్ తనని గుర్తుపడతాడా? లేదా అనే డౌట్ తోనే చేశారట…
కానీ ఫోన్ చేసిన తర్వాత శేఖర్ కమ్ముల తన గురించి చెప్పగానే ధనుష్ ఆయన సినిమాల్లోని కొన్ని సీన్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సినిమాలో సీన్ బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారట. దాంతో ఒక్కసారిగా శేఖర్ కమ్ముల ఆశ్చర్యానికి గురైనట్టుగా తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్ర నటిస్తుండడం విశేషం…
మరి ఆ పాత్రలో ఆయన ఎలా నటించి మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో రష్మిక మందాన నటిస్తున్న పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందంటూ శేఖర్ కమ్ముల తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి శేఖర్ కమ్ముల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా ధనుష్ కి ఒక భారీ సక్సెస్ ని కట్టబెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…