Tollywood : ప్రతిరోజు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడం సాధారణమైపోయింది. ఇదే క్రమంలో హీరోయిన్స్ కూడా తమ అభిమానులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియా ద్వారా రకరకాల ఫోటోషూట్లు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది నటీనటులు సినిమాల్లో బిజీ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చేరువలో ఉంటారు. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి బిజీగా గడిపిన చాలామంది స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ రంగంలోకి దిగడంతో సీనియర్ భామలు కొంతమంది కనుమరుగైపోయారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్స్ అడపాదడపా సినిమాలు చేస్తుంటే మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం సినిమాలలో సెకండ్ హీరోయిన్స్ గా లేదా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా ఇదే కేటగిరీకి చెందింది. ఒకప్పుడు ఈమె అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఒకప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరికీ జోడిగా నటించి సినిమాలు చేసింది. తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు. అప్పట్లో వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె సినిమా అవకాశాలు లేక తన ఫ్యామిలీతో విదేశాలలో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు హీరోయిన్ శ్రియ.

గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇష్టం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది శ్రీయ.అయితే మొదటి సినిమాతో శ్రీయ కు అంతగా గుర్తింపు రానప్పటికీ నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాతో ఈమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు ఈమె టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఏలింది. అప్పట్లో స్టార్ హీరోలు కూడా శ్రియా డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగుతో పాటు, తమిళ్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. నటనతో పాటు ఈమె అందంతో కూడా అందరిని ఫిదా చేసింది.
ప్రస్తుతం నాలుగు పదుల వయసులో కూడా శ్రియ తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈమె సినిమాలకు గ్యాప్ ఇచ్చి అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఒక చిన్న రోల్లో కనిపించింది శ్రియ. ఇక ఇప్పుడు తన భర్త కూతురితో టైం స్పెండ్ చేస్తుంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీయ చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్గా తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ కూడా తన హాట్ హాట్ ఫోటోలతో కుర్ర కారును కవ్విస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.