Sekhar Kammula Pawan kalyan : టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ముల(Sekhar Kammula). ఏ జానర్ ని ఎంచుకున్నా, ఆ జానర్ లో కల్ట్ క్లాసిక్ చిత్రాలను తీయడం ఈయనకు అలవాటు. గోదావరి,ఆనంద్, హ్యాపీ డేస్,లీడర్, ఫిదా,లవ్ స్టోరీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంటుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘కుబేర(Kubera Movie)’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతో, లేకపోతే కొత్తవాళ్లతో సినిమాలను తీస్తూ వచ్చాడు. కానీ స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రయత్నాలు అయితే గట్టిగానే చేసేవాడట.
శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి, చిరంజీవి(Megastar Chiranjeevi) కి చాలా పెద్ద అభిమాని. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘తన ప్రతీ సినిమాలో పవన్ కళ్యాణ్ ని హీరో గా ఊహించుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. గోదావరి చిత్రాన్ని ముందుగా పవన్ కళ్యాణ్ తోనే చెయ్యాలని అనుకున్నాడు, కానీ కుదర్లేదు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో ‘ఫిదా’ చిత్రం చెయ్యాలని అనుకున్నాడు. కానీ అది కూడా కుదర్లేదు. ఎందుకంటే స్టార్ హీరోలు శేఖర్ కమ్ముల సబ్జక్ట్స్ కి పనికిరారు అనే వాదన ఇండస్ట్రీ లో గట్టిగా ఉంది. అయితే కుబేర చిత్రం శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ కి తగ్గ సినిమా కాదు. ఆయన ఈ జానర్ ని ఎంచుకున్నప్పుడు అందరూ షాక్ కి గురయ్యారు. శేఖర్ కమ్ముల ఇలాంటి జానర్స్ ని కూడా తీయగలడా అని ఆశ్చర్యపోయారు. ఇలాంటి జానర్స్ ని తీసినప్పుడు స్టార్ హీరోలతో సినిమా తీయడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు సైతం కామెంట్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల వైపు టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను పడిందట. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తన మిత్రుడు పవన్ కళ్యాణ్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఒక సినిమా తీయించే పనిలో పడ్డాడట. ‘కుబేర’ కి విడుదలకు ముందే వీళ్ళ మధ్య చర్చ జరిగిందని అంటున్నారు. శేఖర్ కమ్ముల గతం లో రానా దగ్గుబాటి తో లీడర్ అనే చిత్రం తీసాడు. అప్పటి పొలిటికల్ సిస్టం మీద శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన కెరీర్ లో ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్ అనొచ్చు. పవన్ కళ్యాణ్ తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అవగాహనా చేసుకొని ఒక పవర్ ఫుల్ పొలిటికల్ సబ్జెక్టు చెయ్యాలని శేఖర్ కమ్ముల మనసులో చాలా రోజుల నుండి ఒక ఆలోచన ఉందట. ఆ ఆలోచనతోనే త్వరలో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇది ఎంత వరకు నిజ అవుతుందో చూడాలి.