తెలుగు కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ విభిన్న హీరో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు, వీరి కలయికలో ఒక సినిమా రాబోతుంది అనగానే అసలు ఎవరూ నమ్మలేదు. ఒకవేళ వీరి కాంబినేషన్ లో సినిమా చేసినా అది వర్కౌట్ అవుతుందా ? శేఖర్ కమ్ముల క్లాసిక్ టచ్, ధనుష్ మాస్ టచ్ కి ఎంతవరకు సింక్ అవుతుంది ? అనేది సగటు సౌత్ ఇండియా ప్రేక్షకుడి డౌట్.
కానీ ఆ డౌట్లు అన్నీ పటాపంచలు చేస్తూ శేఖర్ కమ్ముల దూకుడు పెంచాడు. ధనుష్ ను ఈ మధ్య తరుచుగా కలుస్తూ కథ గురించి వివరణ ఇస్తూ మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకువెళ్లడానికి అన్ని రకాలుగా శేఖర్ కమ్ముల పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ ఓ తమిళ చిత్రం షూటింగ్ చేస్తూ, హైదరాబాద్ లో ఉండటం కూడా శేఖర్ కమ్ములకు బాగా కలిసొచ్చింది.
రాత్రి కూడా శేఖర్ కమ్ములతో పాటు నిర్మాతలు నారాయణ్ దాస్, సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు కూడా వెళ్లి ధనుష్ ను పర్సనల్ గా కలిసి వచ్చారు. మొత్తానికి యూనివర్సల్ అప్పీల్ ఉన్న హీరోతో అలాగే స్టార్ హీరోతో సినిమా చేయడం శేఖర్ కమ్ములకు ఇదే మొదటిసారి. అత్యంత ప్రతిభావంతుడిగా శేఖర్ ను తక్కువ చేసి మాట్లాడలేం. కానీ, భారీ చిత్రాన్ని అలాగే మాస్ సినిమాని శేఖర్ కమ్ముల ఎలా తీస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న.
తాను ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాను అంటూ శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చాడు గాని, ధనుష్ ఫ్యాన్స్ కి అయితే నమ్మకం కుదరడం లేదు. అన్నట్టు ఈ చిత్రానికి సోనాలి నారంగ్ సమర్పకురాలు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్నతమైన నటులను,మరియు టెక్నీషియన్స్ ను తీసుకోబోతున్నారట.