Saif Ali Khan : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పేరు గత రెండు మూడు రోజుల నుండి మీడియా లో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి, అతని పై కత్తితో దాడి చేయగా, సైఫ్ అలీ ఖాన్ ని ఆసుపత్రికి తరలించి వెంటనే చికిత్స అందించారు. పలు సర్జరీల తర్వాత సైఫ్ అలీ ఖాన్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. రీసెంట్ గానే ఆయన్ని డిశ్చార్జ్ కూడా చేసారు. ఈ ఘటన తర్వాత ఇప్పుడు మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. కారణం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆయన కుటుంబానికి చెందిన 15000 కోట్ల రూపాయిల విలువ చేసే ఆస్తులను జప్తు చేయబోతుండడమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే మధ్య ప్రదేశ్ రాజధాని భూపాల్ లోని 15000 కోట్ల రూపాయిల విలువగల ‘ఫ్లాగ్ హౌస్’ ని ప్రభుత్వం స్వాధీన పర్చుకోబోతుంది.
ఇప్పటికే రాజధాని భూపాల్ లో సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. వాటికి సంబంధించి అనేక తగాదాలు ఉండడంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన ఈ ఫ్లాగ్ హౌస్ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుంది. 1968 వ సంవత్సరం లో ఈ ఎనిమీ యాక్ట్ ని రూపొందించారు. ఈ యాక్ట్ ప్రకారం భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన వ్యక్తులు భారతదేశంలో వదిలిపెట్టి వెళ్లిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే నవాబ్ హామీదుల్లా ఖాన్ ఆస్తికి చట్టప్రకారం వారసురాలు ఆయన పెద్ద కుమార్తె అబీదా. ఆమె 2015 వ సంవత్సరం లో భారత్ ని వదిలి పాకిస్థాన్ కి వెళ్ళింది. ఈ విషయాన్నీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఈ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది.
అయితే నవాబ్ద్ రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ వారసులు సైఫ్ అలీ ఖాన్, షర్మిల ఠాగూర్ లు ఈ ఆస్తిపై తమకు హక్కు ఉందని కోర్టులో దావా వేశారు. దీనిపై త్వరలోనే కోర్టు నుండి సంచలన తీర్పు రానుంది. చట్ట ప్రకారం అయితే ఈ ఆస్తి సైఫ్ అలీ ఖాన్ కి దక్కే అవకాశాలు దాదాపుగా లేనట్టే. వరుసగా సైఫ్ అలీ ఖాన్ కి ఇలాంటి సంఘటనలు జరగడం ఆయన అభిమానులను షాక్ కి గురి చేస్తుంది. సైఫ్ అలీ ఖాన్ మన తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ద్వారా పరిచయమైనా సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ద్వారా సైఫ్ అలీ ఖాన్ మన ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.