50 ఏళ్ల వయసు అంటే.. మలిదశ జీవితంలోకి ప్రవేశిస్తున్నట్టే లెఖ్ఖ. కానీ.. ఆ వయసులోనూ తగ్గేదే లేదంటూ పిల్లల్ని కంటున్నారు పలువురు సినీ సెలబ్రిటీలు! ఎలాంటి అవసరాలు వారిని ఇందుకు సిద్ధం చేస్తున్నాయోగానీ.. లేటు వయసులోనూ పిల్లలకు జన్మనిస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ తరహా సెలబ్రిటీలు ఉన్నారు. వారెవరో ఓ లుక్కేద్దామా?
తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖంగా కనిపిస్తారు. ఆయన మొత్తం 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటగా 1997లో నందినిని పెళ్లి చేసుకున్నారు. విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేసి, బాబు పుట్టాక ఏడడుగులు వేశారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి 2013 లో తీన్మార్ మూవీలో తనతోపాటు నటించిన అన్నా లేజనోవాను పెళ్లి చేసుకున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ కు అఖీరా నందన్, ఆధ్య జన్మించారు. ఇప్పుడు అఖీరా వయసు 17 సంవత్సరాలు. కాగా.. అన్నాలెజొనోవా తోనూ ఇద్దరిని కన్నారు పవన్. మొదటగా పాపకు, 2017లో బాబుకు జన్మనిచ్చారు. ఈ బాబుకు నాలుగేళ్లు కాగా.. పవన్ కళ్యాణ్ వయసు 49 సంవత్సరాలు.
Also Read: తల్లిదండ్రులను రోడ్డుపై నిలబెట్టిన.. టాలీవుడ్ పెద్దల కూతుర్లు వీరే..
ఇక, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రికార్డు కూడా ఇలాగే ఉంది. ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో చెప్పాల్సిన పనిలేదు. ఈ నటుడు కూడా నిజ జీవితం లో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారరు. మొదటగా లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. అయితే.. 2004లో అబ్బాయి చనిపోయాడు. ఆ తరవాత లలిత కుమారితో విభేదాలు తలెత్తడంతో ప్రకాష్ రాజ్ విడిపోయారు. 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్ రాజ్. వీళ్ళకి 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏజ్ 55 సంవత్సరాలు.
Also Read: టాలీవుడ్ కోసం రూ.500 కోట్లు దానమిచ్చాడు.. ఆ నటుడు ఎవరో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ గురించి అందరికి తెలుసు. ఆయన తెలుగు లో కూడా చాలా సినిమాలు చేసారు. శరత్ కుమార్ 1984లోనే ఛాయా అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒకరు వరలక్ష్మి, ఇంకొకరు పూజ. వీరిలో వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఫేమస్ నటి. రవితేజ ‘క్రాక్’ మూవీలో జయమ్మ క్యారెక్టర్లో నటించింది ఆమెనే. అయితే.. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం తో ఛాయతో విడిపోయారు శరత్ కుమార్. ఆ తర్వాత నిన్నటి తరం ప్రముఖ హీరోయిన్, నటి రాధికను 2001లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు అయన పేరు రాహుల్. అతడి వయసు 16 సంవత్సరాలు. శరత్ కుమార్ ఏజ్ 66 సంవత్సరాలు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఈ విధంగా లేట్ వయసులో పిల్లల్ని కనేవారి సంఖ్య తక్కువేం లేదు. దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇలాంటి వారు ఉన్నారు. దీనికి రెండు కారణాలున్నాయి. రెండో పెళ్లి చేసుకోవడం ఒకటైతే.. లేటుగా వివాహం చేసుకోవడం మరొకటి. ఫామ్ లో ఉన్నవారు పెళ్లి చేసుకుంటే.. ఎక్కడ కెరీర్ కు ఆటంకం ఏర్పడుతుందోనని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీంతో.. మరింత లేటుగా పిల్లలకు జన్మనిస్తున్నారు. మరి, ఇలాంటి విచిత్రాలు ఇంకెన్ని నమోదవుతాయో చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Seeing children in their 50s do you know any of those tollywood celebrities
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com