https://oktelugu.com/

Khiladi Movie: దీపావళి కానుకగా రవితేజ “ఖిలాడి” టైటిల్ సాంగ్ …

Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా… డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఖిలాడి”. రవితేజ కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌తో  ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీపావళి కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇవ్వనున్నాడు రవితేజ. అయితే తాజాగా ఖిలాడి మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు […]

Written By: , Updated On : November 1, 2021 / 08:28 PM IST
Follow us on

Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా… డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఖిలాడి”. రవితేజ కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌తో  ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీపావళి కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇవ్వనున్నాడు రవితేజ.

second song from khiladi movie releasing on november 4th as diwali gift

అయితే తాజాగా ఖిలాడి మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నవంబర్ 4వ తేదీన ఉదయం 10గంటల 8నిమిషాలకు సెకండ్ సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇది వరకే అప్డేట్ రాగా ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పుడు ప్రకటించారు.  ఈ  సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సత్యనారాయణ కోనేరు నిర్మాత కాగా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది ఈ సినిమా. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఒకవైపు “రామారావు ఆన్ డ్యూటీ ” సినిమాని  శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం రెండవ షెడ్యూల్ పూర్తి దశకు చేరుకుంది. అలానే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో “ధమాకా” అనే సినిమా చేస్తున్నట్లు దసరా పండుగ సందర్భంగా పోస్ట్ రిలీజ్ చేశారు. రవితేజ  70వ చిత్రాన్ని కూడా త్వరలోనే పట్టలెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనుండగా… రవితేజ కూడా ఈ చిత్రనిర్మాణంలో భాగస్వామి కానున్నట్లు సమాచారం.