Devara : #RRR చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్యనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ సినిమా, అప్పుడే నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఈ సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ మధ్య వచ్చే కొన్ని పోరాట సన్నివేశాలను గ్రాండ్ గా తెరకెక్కించాడు కొరటాల శివ. ఈ ఏడాది నవంబర్ నెల లోపు షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తారీఖున గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రధాన భాగం మొత్తం సముద్ర తీరం లోనే ఉంటుంది.కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో సముద్ర తీరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ షూటింగ్ తీసుకోవచ్చు. కానీ కొరటాల శివ మాత్రం హైదరాబాద్ లోనే సముద్రం సెట్ వేసి తీస్తున్నాడట. ఈ సెట్ లోనే అండర్ వాటర్ భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా తెరకెక్కించాడట. ఏమాత్రం కూడా ఇది సముద్రం సెట్ అనే ఫీలింగ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కొరటాల శివ.
హైదరాబాద్ లో సముద్రం సెట్ అనగానే, మనకి నేనింత సినిమాలో వేణుమాధవ్ మరియు సుబ్బరాజు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశం గుర్తుకు వస్తుంది. హైదరాబాద్ లో సముద్రం సెట్ అనగానే సుబ్బరాజు వేణు మాధవ్ చెంప పగలగొడుతాడు. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు సోషల్ మీడియా లో నెటిజెన్లు.చూడాలి మరి కొరటాల శివ ఈ చిత్రం తో ఎలాంటి మ్యాజిక్ చెయ్యబోతున్నాడు అనేది.