https://oktelugu.com/

Robots: మహిళలకు పురుషులతో పని లేదట.. ఇకపై ఆ పని రోబోలతోనేనట..

సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త మార్పులకు గురవుతోంది. ఇదే సమయంలో కొత్త కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. మనిషి జీవితాన్ని అత్యంత సుఖవంతం చేస్తున్నాయి. ఇదే సమయంలో అవి మనిషి జీవితంలో పెను మార్పులకు కారణమవుతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 8, 2024 / 01:42 PM IST

    Robots

    Follow us on

    Robots: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆవిష్కరణల్లో ప్రధానమైనవి రోబోలు. ఒకప్పుడు రోబోలు అనేక క్లిష్టమైన ఆపరేషన్లలో మాత్రమే పాల్గొనేవి. కానీ ఇటీవల వీటి వినియోగం పెరిగిపోయింది. సైన్యం చేపట్టే పలు ఆపరేషన్లలో వీటిని ఉపయోగిస్తున్నారు. క్లిష్టమైన పనులే కాకుండా ఇతర పనుల్లో వినియోగిస్తున్నారు. రోబోల సహాయంతో అధునాతన శస్త్ర చికిత్సలు.. రెస్టారెంట్లలో సర్వర్లు.. అంతరిక్ష ప్రయోగాలు… వంటి వాటిని చేస్తున్నారు.. అయితే రోబోల వినియోగం ఇలానే పెరిగితే అవి మనిషి జీవితంలో మరింత చర్చకు వస్తాయని.. ముఖ్యంగా రోబోలు ఆడవాళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించిన రోబో సినిమా లో.. రోబో మనిషి జీవితంలో ఎలాంటి మార్పులకు కారణమవుతుందో చూపించాడు. అప్పట్లో ఆ మార్పులు సినిమాటిక్ గా కనిపించినప్పటికీ.. వచ్చే ఆరు సంవత్సరాలలో సరిగ్గా అలాంటి మార్పులే చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

    ప్రేమలో పడతారట

    రోబో సినిమాలో చిట్టి అనే హ్యూమనాయిడ్ అనే రోబో ఐశ్వర్యరాయ్ తో ప్రేమలో పడుతుంది. దానికోసం తనను సృష్టించిన వశీకర్ ను చంపేయాలని భావిస్తుంది. అందుకోసం కరకరకాల కుయుక్తులు పన్నుతుంది. అయితే వచ్చే ఆరు సంవత్సరాలలో రోబోలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకపోయినప్పటికీ.. మహిళలు రోబోలతో ప్రేమలో పడతాయట. ముఖ్యంగా శృంగారం విషయంలో పురుషుల కంటే రోబోలను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట. ఈ విషయాన్ని ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ పియర్సన్ వెల్లడించారు. 2030 నాటికి వర్చువల్ రియాల్టీ శృంగారం సర్వసాధారణమైపోతుందని ఆయన ప్రకటించారు. 2035 నాటికి శృంగార సంబంధిత పరికరాలు దానితో అనుసంధానమవుతాయట . 2050 నాటికి రోబోలతో శృంగారం జరపడం సర్వసాధారణంగా మారుతుందట. ఒకవేళ ఆడవాళ్లు ఇతర రిలేషన్ లు కలిగి ఉన్నా కూడా.. రోబో లతో శృంగారానికి ప్రాధాన్యం ఇస్తారట. అయితే ఇవన్నీ ఊహాజనితమని.. అలాంటి వాటికి ఆడవాళ్లు ప్రాధాన్యం ఇవ్వరని కొంతమంది కొట్టి పారేస్తున్నారు. ఇష్టానుసారంగా ఎవరెవరో ఏవేవో వ్యాఖ్యలు చేస్తే వాటిని ఎందుకు సమర్థించాలని చెబుతున్నారు. ” మనిషి ఆవిష్కరించిన రోబో లపై ప్రేమను పెంచుకోవడం ఆడవాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? అది ప్రేమ ఎలా అవుతుంది? మనిషిలాగా రోబో స్పందించదు కదా.. ప్రేమ అంటే శృంగారం ఒక్కటే కాదు కదా.. ఒక మనిషి సంబంధించిన అనేక భావాలు రోబో ఎలా పలికిస్తుంది.. ప్రేమంటేనే అనేక భావాల సమ్మేళనం కదా.. అలాంటి భావాలను పొందకుండా ప్రేమను ఎలా ఆస్వాదించడం సాధ్యమవుతుంది.. వస్తువులను ఎలా ఉపయోగించాలో మనుషులకు తెలుసు.. ముఖ్యంగా మహిళలకు మరింత బాగా తెలుసని” కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.