Homeఎంటర్టైన్మెంట్Save The Tigers 3: 'సేవ్ ది టైగర్స్ 3' వెబ్ సిరీస్ రివ్యూ :...

Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్ 3’ వెబ్ సిరీస్ రివ్యూ : ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదు..

Save The Tigers 3: ‘ ఓటీటీ వెబ్ సిరీస్ లలో ఈమధ్య కాలం లో ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. ప్రియదర్శి , అభినవ్ గోమాటం , చైతన్య కృష్ణ , వెన్నెల కిషోర్, సుజాత, పావని గంగిరెడ్డి , దేవయాని శర్మ, హర్ష వర్ధన్, గంగవ్వ తదితరులు ఈ వెబ్ సిరీస్ లో నటించారు. ఇప్పటి వరకు ప్రసారమైన రెండు సీజన్స్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న మూడవ సీజన్ ని విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?, మొదటి రెండు సీజన్స్ ని మించి ఉందా?, లేదా నిరాశపరిచిందా? వంటివి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

గత సీజన్స్ లో జరిగిన గొడవల తర్వాత ముగ్గురు మిత్రుల జీవితాల్లో కొన్ని కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. నటి హంసలేఖ(సీరత్ kapoor) వ్యవహారం ముగిసిన తర్వాత , గంటా రవి (ప్రియా దర్శి) తన భార్య గోల తట్టుకోలేక, ఆమె బలవంతం మీద గేటెడ్ కమ్యూనిటీ కి షిఫ్ట్ అవుతాడు. మరోపక్క రాహుల్ (అభినవ్) తనకు నచ్చని ఉద్యోగం చేస్తూ బాధలు పడుతుంటే , విక్రమ్ (కృష్ణ చైతన్య) తన భార్య తో విడాకుల సమస్యలతో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఒక రోజు తమ జీవితం లో చోటు చేసుకున్న ఈ సంఘటనలకు స్వర్గ లోకం లో ఉన్న ఇంద్రుడే (వెన్నెల కిషోర్) కారణమని, ఫుల్ గా తాగేసి గట్టిగా ఆయన్ని తిడుతారు. వాళ్ళ బాధ ని అర్థం చేసుకున్న ఇంద్రుడు , వారి సమస్యను పరిష్కరించే బాధ్యతని చిత్రగుప్తుడు (గుండు సుదర్శన్) కి అప్పగిస్తాడు. ఒక వింత లైఫ్ ఛేంజింగ్ డీల్ తో చిత్ర గుప్తుడు భూలోకానికి వస్తాడు. ఆ వింత డీల్ ఏంటి?, దాని వాళ్ళ ఈ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు , మలుపులు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

ఇంతకు ముందు ప్రసారమైన రెండు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త భిన్నమైనది. డైరెక్టర్ ఈసారి సరికొత్త ఫాంటసీ ని జోడించి , మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే కాన్సెప్ట్ కి , మెగాస్టార్ చిరంజీవి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ మూవీ కాన్సెప్ట్ ని జోడించి ఈ సిరీస్ ని తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీరామ్ ఎరగం. ఈ సీజన్ మొత్తం చూసేందుకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. మొదటి రెండు ఎపిసోడ్స్ పెద్దగా ఏమి అనిపించవు కానీ , మూడవ ఎపిసోడ్ నుండి అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ మొదలు అవుతుంది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీకెండ్ లో కుటుంబ సమేతంగా ఈ సిరీస్ ని చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular