Sarkaru Vaari Paata- TS Govt: మహేశ్ బాబు నటించిన కొత్త సినిమా సర్కారు వారి పాట. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టికెట్లు కూడా అదే విధంగా అమ్ముడవుతున్నాయి. మహేశ్ బాబు అభిమానులకు పండగే కానుంది. దీంతో సినిమా కొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో థియేటర్లలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు షోలు వేసుకోవచ్చని సూచించింది. .భ్రమరాంబ, మల్లికార్జున, శ్రీరాములు థియేటర్లలో ఈ షోలు వేసుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు వారం రోజుల పాటు టికెట్ల ధరలు కూడా రూ. 50 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్కారు వారి పాటకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో సినిమాకు మంచి బోణీ దక్కనుందని తెలుస్తోంది.
Also Read: Former Minister Narayana: నారాయణ అరెస్ట్ ఎపిసోడ్ లో ప్రభుత్వానికి చుక్కెదురు
ఇప్పటికే సర్కారు వారి పాట చిత్రం ప్రేక్షకుల్లో సందడి రేపుతోంది. మహేశ్ బాబు లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక మహేశ్ నటన అందరికి తెలిసిందే. తన మాటలతో అందరిని ఆకట్టుకోవడం అతడికి అలవాటే సైలెంట్ గా ఉన్నా సక్సెస్ లకు కొదవ లేదు. తన నటనకు ప్రేక్షకులు ఫిదా అవడం ఖాయమని తెలుస్తోంది. దీంతో చిత్రం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో సందడి చేయనుందని తెలుస్తోంది.

ఇందులో కీర్తి సురేష్ నటన కూడా అాద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. మహానటితో తన నటనను చూపించిన కీర్తి సురేష్ మరో విజయం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సర్కారు వారి పాట అటు మహేశ్ బాబు, ఇటు కీర్తి సురేష్ కు మంచి మార్కులు ఇవ్వనుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా కొన్ని గంటల్లో సర్కారు వారి పాట భవితవ్యం తేలనుంది. విజయమో అపజయమో తేలనుంది.
Also Read:Mahesh Babu Sarkaru Vaari Paata movie review: రివ్యూ : ‘సర్కారు వారి పాట’.. హిట్టా? ఫట్టా?
Recommended Videos