Sarkaru Vaari Paata Twitter Review: సర్కారు వారి పాట ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Sarkaru Vaari Paata Twitter Review: రెండున్నరేళ్ల భారీ గ్యాప్ తర్వాత.. కరోనా కష్టాలు అధిగమించి మరీ వస్తున్న మూవీ ‘సర్కారువారి పాట’. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. యువ దర్శకుడు పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికా , ఓవర్సీస్ లో […]

Written By: NARESH, Updated On : May 12, 2022 12:41 pm
Follow us on

Sarkaru Vaari Paata Twitter Review: రెండున్నరేళ్ల భారీ గ్యాప్ తర్వాత.. కరోనా కష్టాలు అధిగమించి మరీ వస్తున్న మూవీ ‘సర్కారువారి పాట’. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. యువ దర్శకుడు పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

Sarkaru Vaari Paata

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికా , ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు అప్పుడే తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అసలు కథేంటి? కథనం ఎలా ఉంది? సినిమా ఆకట్టుకుందా? లేదా? అని అభిప్రాయాలు ట్విట్టర్ లో వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Gangotri movie Child Artist : ‘గంగోత్రి’ సినిమాలోని వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

మెజార్టీ అభిప్రాయం చూస్తుంటే మహేష్ బాబుకు మరో బ్లాక్ బస్టర్ పడినట్లేనని అంటున్నారు. ఈ సినిమా రన్ టైం 160 నిమిషాలు అంటే దాదాపు 2 గంటల 40 నిమిషాలు ఉంది. ఈ సినిమా మొత్తం 120 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం 121 కోట్లు రావాల్సి ఉంది.

మహేష్ బాబు యాటిట్యూట్ ను ఈ రేంజ్ లో ఎప్పుడూ చూసి ఉండరని ఓ నెటిజన్ ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చాడు. మమేష్-కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. వెన్నెల కిషోర్-మహేష్ కామెడీ పీక్స్ లో ఉందని.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని అంటున్నారు. ఓవరాల్ గా సర్కారివారి పాట కమర్షియల్ ఎంటర్ టైనర్ అంటున్నారు.

ఫస్టాఫ్ బాగుందని.. సెకండాఫ్ యావరేజ్ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు.

ఇక సినిమాలో సైలెన్స్ డైలాగ్ అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. మహేష్ ఈ సినిమాను భుజాన మోసాడని అంటున్నారు. సినిమాను మహేష్ ఒక్కడే లాగించేశాడని అంటున్నారు. పెన్సీ సాంగ్ అదిరిపోతుందట.. గుండెల మీద చేయి వేసుకొని వెళ్లండి మహేష్ ఉగ్రరూపం అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

మహేష్ ఎనర్జీ లెవర్స్ పీక్స్ లో ఉన్నాయని.. ఒక్కడే ఈ సినిమా లాగుతున్నాడని.. ఫస్టాఫ్ లో మహేష్-వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయాయని కొందరు అంటున్నారు. ఇక రెండే పాటలు బాగున్నాయని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

 

Also Read:సర్కారివారి పాట సాంగ్ కూడా కాపీయేనా? తమన్ ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో తెలుసా?
Recommended Videos


Tags