https://oktelugu.com/

Sarkaru Vaari Paata: ‘సర్కారు’ మోత మోగింది.. మహేష్ రికార్డుల వేట మొదలైంది !

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ విడుదలైంది. చెప్పినట్టుగానే ఈ పాట రికార్డుల మోత మోగిస్తోంది. ‘సరా సరా సర్కారు వారి పాట… షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా…’ అంటూ సాగిన ఈ టైటిల్ సాంగ్ చాలా బాగా ఆక‌ట్టుకుంటోంది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్.త‌మ‌న్ అందించిన ట్యూన్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో సాగింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సాగిన ఈ పాటకు ప్రేక్ష‌కుల […]

Written By:
  • Shiva
  • , Updated On : April 23, 2022 / 12:15 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ విడుదలైంది. చెప్పినట్టుగానే ఈ పాట రికార్డుల మోత మోగిస్తోంది. ‘సరా సరా సర్కారు వారి పాట… షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా…’ అంటూ సాగిన ఈ టైటిల్ సాంగ్ చాలా బాగా ఆక‌ట్టుకుంటోంది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్.త‌మ‌న్ అందించిన ట్యూన్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో సాగింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

    Sarkaru Vaari Paata

    ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సాగిన ఈ పాటకు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వస్తోంది. ఈ సాంగ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదలై.. అప్పుడే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ గా మారింది. ఆల్ రెడీ ఈ సినిమాలోని కళావతి, పెన్నీ సాంగ్స్ చాలా బాగా అలరించాయి. ఈ సాంగ్ అంతకుమించి అన్నట్టు ఉంది.

    Also Read: Roja: ఎక్స్ట్రా జబర్దస్త్ లో హీరోయిన్ పరువు తీసిన రోజా.. జంతువుతో పోలుస్తూ?

    ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట. తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి పాటల పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న సాంగ్స్ ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది.

    సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

    Sarkaru Vaari Paata

    ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది. తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    Also Read:IPL 2022: నాడు ధోని.. నేడు పంత్ అచ్చం అలానే చేశారు.. కానీ..!

     

    Recommended Videos:

     

    Tags