‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’ పేరుతో ‘సర్కారు వారి పాట’ టీమ్ నిన్న రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. నిన్నటి నుండి ఈ వీడియో లైక్స్ అండ్ షేర్ లతో ట్రెండ్ సెట్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో 25.7 మిలియన్ల వ్యూస్ ను, అలాగే 7 లక్షల 54 వేల లైక్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను సెట్ చేసింది ఈ వీడియో.
ముఖ్యంగా ఈ వీడియోలో మహేష్ లుక్స్ చాలా కొత్తగా ఉంది. మహేష్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇక వీడియోలో పెట్టిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఈ వీడియో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా సర్‌ప్రైజ్ చేసింది. ‘ఇఫ్ యూ మిస్ ది ఇంట్రస్ట్ యు విల్ గెట్ ది డేట్’ అంటూ మహేష్ రౌడీలతో చెప్పిన డైలాగ్ మాడ్యులేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఇక కీర్తి సురేష్ ‘సార్ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేష్ అందానికి ఫిదా అయినట్టు కీర్తి సురేష్ తన కళ్ళల్లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉంది. వీరిద్దరి లవ్ ట్రాక్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందట. దూకుడులో మాదిరిగా హీరోయిన్ టీజింగ్ సీన్లతో మాంచి ఫన్ పండిందని తెలుస్తోంది.
నిజానికి దర్శకుడు పరుశురామ్ లవ్ ట్రాక్ లను బాగా రాస్తాడు, మహేష్-కీర్తి ల నడుమ కూడా మంచి ఫన్ సీన్లు రాశాడట. మొత్తానికి మహేష్ అభిమానులకు ‘సర్కారు వారి పాట’ టీమ్ ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అన్నట్టు పరుశురామ్ జీవతంలో వచ్చిన మొదటి పెద్ద ఛాన్స్ ఇది.. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.
A MASSSS Hysteria by our
ass laster #SuperStarBirthdayBLASTER created ALL TIME HIGHEST BID IN TOLLYWOOD▶️ https://t.co/AzU2WcOOY5#SarkaruVaariPaata
Super @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @GMBents @14ReelsPlus pic.twitter.com/qgXnLzubr1
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2021