Sarkaru Vaari Paata OTT Steaming: ఓటీటీలోకి ‘సర్కారువారి పాట’.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Sarkaru Vaari Paata OTT Steaming: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారి వారి పాట’ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2వేలకు పైగా థియేటర్స్ లో ఇది రిలీజ్ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్ లు బాగా జరగడంతో తొలి రోజుల్లో కలెక్షన్స్ కు ఢోకా లేదు. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ […]

Written By: NARESH, Updated On : May 17, 2022 11:00 am
Follow us on

Sarkaru Vaari Paata OTT Steaming: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారి వారి పాట’ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2వేలకు పైగా థియేటర్స్ లో ఇది రిలీజ్ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్ లు బాగా జరగడంతో తొలి రోజుల్లో కలెక్షన్స్ కు ఢోకా లేదు. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని అంటుండగా.. మరికొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఊపును కంటిన్యూ చేసేందుకు సర్కారు వారి పాట టీం రెడీ అయ్యింది. అందుకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమ్మేసింది. అమేజాన్ ప్రైమ్ కు దాదాపు రూ.50 కోట్లకు ఓటీటీ హక్కులు అమ్మినట్టు సమాచారం. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మిగతా భాషల్లోనూ ఈ సినిమా డబ్ చేసి స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనతోనే ఇంత భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం.

యువ దర్శకుడు పరుశురాం పెట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావుతోపాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమా ఓటీటీ పార్టనర్ పై ఇన్నాళ్లు సందిగ్ధం నెలకొనేది. కానీ ఇప్పుడు ఓటీటీ హక్కులపై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు ఈ సినిమాను కొనేసింది. ఈ సినిమా థియేటర్ లో విడుదలైన నాలుగు వారాలకు అంటే జూన్ 10న స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recommended Videos