Sarayu: యూట్యూబర్ సరయూతో ఆమె బృంద సభ్యులను బంజారాహిల్స్ పోలీసులు రెండోరోజు విచారించారు. సినీనటి సరయూ(36), బృందం నిర్మించిన ఓ లఘుచిత్రం ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందని ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరయూ, లఘుచిత్ర దర్శక నిర్మాత బీరం శ్రీకాంత్‌రెడ్డి(36), జూనియర్ ఆర్టిస్టులు కృష్ణమోహన్ అలియాస్ సత్యకృష్ణ(27), గణపాక కార్తీక్(20)లను మంగళవారం బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర విచారించారు.

మొత్తానికి బిగ్ బాస్ ఫేం సరయు ఈ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర దృశ్యాలున్నాయనే ఆరోపణలొచ్చాయి. హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా ఆమె నటించింది. అందుకే, ఆమె పై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని, ఈ చర్య తమను అవమానించినట్లు VHP నేత అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: జగన్ తో ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ భేటీ… మెగాస్టారే సూత్రధారి !
అయినా ఈ బూతుల రాణికి ఇదేం కొత్త కాదు కదా. ఏది ఏమైనా సరయూకి మొత్తమ్మీద షాక్ తగిలింది. సహజంగా తన వీడియోల్లో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే ఈ బోల్డ్ నటి గతంలో అనేక రకాలుగా నోరు జారింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా సరయూ దారుణంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు ఆమె ఇలాంటి కేసులను ఎదుర్కోలేదు. మధ్యలో కొంతమంది ఆమె పై ఫిర్యాదులు చేసినా.. అది స్టేషన్ వరకూ వెళ్ళలేదు. కానీ, ఈ సారి మాత్రం కేసు సీరియస్ అయింది.

కానీ, ప్రస్తుతం సరయూ వ్యవహారం పోలీస్ స్టేషన్ లో రచ్చ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యూట్యూబర్ ‘సరయూ’ పై భారీగా విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఈ హాట్ ఓవర్ యాక్షన్ కు తగిన శాస్తి జరిగింది.
Also Read:పెద్ద హిట్ అవుతుందట.. కబుర్లు చెబుతున్న మిస్ ఇండియా !