Homeఎంటర్టైన్మెంట్Sara Arjun: కీర్తి సురేష్ కాదు, శ్రీలీల అంతకన్నా కాదు..చిరంజీవి కి కూతురుగా నటించబోతున్న 1000...

Sara Arjun: కీర్తి సురేష్ కాదు, శ్రీలీల అంతకన్నా కాదు..చిరంజీవి కి కూతురుగా నటించబోతున్న 1000 కోట్ల హీరోయిన్!

Sara Arjun: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మరోసారి అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. గతంలో తనకు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన డైరెక్టర్ బాబీ తో మరోసారి చేతులు కలపబోతున్నాడు మెగాస్టార్. పోయినసారి చిరంజీవి తో ఫక్తు కమర్షియల్ సినిమా చేసిన బాబీ, ఈసారి మాత్రం గ్యాంగ్ స్టర్ డ్రామా తో రాబోతున్నాడు. ఇందులో చిరంజీవి 60 ఏళ్ళ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం తర్వాత చిరంజీవి వయస్సుకు తగ్గ పాత్ర ఇందులోనే చేస్తున్నాడు. అభిమానులకు ఆయన పాత్ర షాకింగ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఉండబోతుంది. అయితే ఇందులో చిరంజీవి కి కూతురు పాత్ర కూడా ఉంటుంది.

ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు. ముందు శ్రీలీలని అనుకున్నారు. ఆ తర్వాత కృతి శెట్టి ని సంప్రదించారు. ఆమె కూడా చెయ్యడానికి సుముఖత చూపించింది కానీ, రెమ్యూనరేషన్ భారీ రేంజ్ లో డిమాండ్ చేసిందట. ఇక గతంలో ‘భోళా శంకర్’ చిత్రం లో చిరంజీవి కి చెల్లి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ ని కూడా అనుకున్నారట. కానీ చివరికి ‘ధురంధర్’ హీరోయిన్ సరా అర్జున్ ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గానే చిరంజీవి ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రాన్ని చూశాడట. అందులో సరా అర్జున్(Sara Arjun) చాలా క్యూట్ గా అనిపించిందట. మన సినిమాలోని నా కూతురు పాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది, ఆమెని ఒకసారి సంప్రదించి చూడండి అని చిరంజీవి బాబీ తో అన్నాడట. అందుకు బాబీ కూడా పర్ఫెక్ట్ ఛాయస్ అని భావించి, సరా అర్జున్ ని సంప్రదించడం, ఆమె వెంటనే ఓకే చేయడం వంటివి జరిగింది.

ఈ సినిమాలో నటించడానికి ఆమె అందుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం రెండు కోట్ల రూపాయిలు మాత్రమేనట. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. సౌత్ ఇండియా లో దశాబ్దాలు గా సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న ఈ ఇద్దరు కలిసి ఇప్పుడే ఒకే సినిమాలో చేయడం మూవీ లవర్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లాగ ఉండబోతుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాకు మెగాస్టార్ కూడా చాలా డిఫరెంట్ లుక్ ని ట్రై చేస్తున్నాడట. ఆడియన్స్ దానిని ఎంత వరకు తీసుకుంటారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version