Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి లేనటువంటి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే ‘పుష్ప 2’ సినిమా వచ్చిందో అప్పటినుంచి ఆయన పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను తీస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు. మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న సినిమా మొత్తాన్ని ముంబైలోనే షూట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. ఇక అల్లు అర్జున్ ఎందుకని ముంబాయి లోనే సినిమా షూటింగ్ ని జరుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జరిగితే మనవాళ్ళకి కూడా పని దొరికేది కదా అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ తొందర్లోనే తన మకాం ను ముంబైకి మార్చే అవకాశం కూడా ఉందంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏదైనా కూడా తను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కాబట్టి ముంబైలో ఉండాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ తను అలా చేస్తే మాత్రం అల్లు అర్జున్ తన అభిమానులకు చాలా దూరం అయిపోతాడు అనే విషయాన్ని గమనించడం లేదంటూ మరి కొంతమంది హెచ్చరిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ప్రేక్షకులకు దగ్గర అవ్వాలన్నా తమ అభిమానులను అలరించాలన్నా కూడా వాళ్ళకి చాలా దగ్గరగా ఉండాలి. కాబట్టి అల్లు అర్జున్ హైదరాబాదులో ఉంటేనే బాగుంటుంది అని ఇంకొంతమంది చెబుతున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట నుంచి అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయబోతున్నాడు కాబట్టి పాన్ ఇండియాని శాసించే హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…