Saptagiri
Saptagiri: సప్తగిరికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, పేమ కథా చిత్రం వంటి మూవీస్ కమెడియన్ గా పేరు తెచ్చాయి. అనంతరం స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. దాంతో హీరోగా ఆఫర్స్ వచ్చాయి. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి, వజ్ర కవచదర గోవిందా చిత్రాల్లో సప్తగిరి హీరోగా నటించాడు. అవేమీ పెద్దగా ఆడలేదు. దాంతో తిరిగి కమెడియన్ గా సినిమాలు చేస్తున్నాడు. తిరిగి మరలా హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఆయన హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ మూవీ మార్చి 21న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సప్తగిరి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Also Read: అవకాశం వస్తే పవన్ కళ్యాణ్, ప్రభాస్ నుండి వాటిని దొంగిలిస్తా అంటూ హీరో నితిన్ షాకింగ్ కామెంట్స్!
కమెడియన్స్ పక్కన హీరోయిన్స్ నటించడానికి ఇష్టపడరు అని ఆయన అన్నారు. తనతో జతకట్టిన ప్రియాంక శర్మ కు ధన్యవాదాలు అన్నాడు. ఇక పెళ్లి ఇబ్బందులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు పిల్లను ఇవ్వరని ఆయన అన్నారు. వారు మంచి వాళ్ళు అయినా, నటుడిగా సక్సెస్ అయినా కూడా అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు రారని చెప్పుకొచ్చాడు. సప్తగిరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక పెళ్లి కాని ప్రసాద్ మూవీకి అభిలాష్ రెడ్డి దర్శకుడు. పెళ్లి కోసం నానా ఇబ్బందులు పడే యువకుడి పాత్ర చేశాడు సప్తగిరి. ఒక పక్క ఏజ్ బార్ అవుతుంటే, తండ్రి మాత్రం కట్నం కోసం కొడుకు పెళ్లిని వాయిదా వేయడం చేస్తుంటాడు. హీరో పెళ్లి కోసం పడే కష్టాలు, ఆ క్రమంలో ఎదురైన ఇబ్బందులు ప్రధానాంశంగా మూవీ తెరకెక్కింది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి కాని ప్రసాద్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ మూవీ సప్తగిరికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కే వై బాబు, భాను ప్రకాష్ గౌడ్, చుక్కా వెంకటేశ్వర గౌడ్ నిర్మించారు. అన్నపూర్ణ, మురళీధర్ గౌడ్, రోహిణి, రామ్ ప్రసాద్ కీలక రోల్స్ చేశారు.
Also Read: మళ్లీ హాస్పిటల్ బెడ్ కి పరిమితమైన సమంత.. ఆందోళనలో అభిమానులు..ఈసారి ఏమైందంటే!
Web Title: Saptagiri comments on comedians
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com