Sankranthiki Vasthunnam Premiere Show Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న నటుడు విక్టరీ వెంకటేష్… ప్రస్తుతం ఆయన సంక్రాంతి కానుక గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేశాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ పడిపోయాయి. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ తన సొంత ఊరికి వెళ్లి ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతాడు. ఇక అదే సమయంలో ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించిన ఆపరేషన్ ను మీనాక్షి చౌదరికి అప్పచెబుతారు. ఇక వెంకటేష్ ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ లో వెంకటేష్ ఉంటే తనకు కొంచెం ఈజీ అవుతుందనే ఉద్దేశ్యం తో వెంకటేష్ కూడా మీనాక్షి ని అందులో భాగం చేయాలని చూస్తుంది. ఇక వెంకటేష్ భార్యకి, తన ఎక్స్ లవర్ కి మధ్య ఎలాంటి సిచువేషన్స్ ఎదురయ్యాయి. దానివల్ల వెంకటేష్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే అనిల్ రావిపూడి ప్రతి సినిమా కూడా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. దానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా కూడా చాలా ఎంటర్ టైనింగ్ గా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా వెంకటేష్ క్యారెక్టర్ ను ఫుల్ లెంత్ కామెడీ కోసం వాడుకోవడం అనేది ఒక మంచి విషయమనే చెప్పాలి. మల్లీశ్వరి సినిమా తర్వాత వెంకటేష్ ఫుల్ లెంత్ కామెడీ చేసిన సినిమా చేసింది అయితే మనకు కనిపించలేదు. అనిల్ రావిపూడి మార్క్ ని కొనసాగిస్తూనే అక్కడక్కడ ఎమోషన్స్ ని కూడా బిల్డ్ చేసుకున్నారు.
దాని ద్వారా ప్రేక్షకులకు సినిమా మీద మంచి హై ఫీల్ రావడమే కాకుండా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ లేకుండా ముందుకు సాగుతుంది. ఇక ఈ సినిమాకి బీమ్స్ వచ్చిన మ్యూజిక్ కూడా చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన అందించిన మ్యూజిక్ ని ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు… మొత్తానికైతే అనిల్ రావిపూడి తన ఖాతాలో ఎనిమిదోవ సక్సెస్ ను కూడా వేసుకున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్ లో ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా భాగమయ్యాడనే చెప్పాలి…
ఆర్టిస్టులు స్క్రీన్ మీద కనిపిస్తూ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అక్కడక్కడ మనకు కొంచెం క్రీంజ్ కామెడీ కనిపించినప్పటికి అనిల్ రావిపూడి సినిమాల్లో మనకు తరచుగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయిన కూడా ఆ కామెడీని ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు…ముఖ్యంగా ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఇప్పుడు మరొక మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ మొదటి నుంచి చివరి వరకు చాలా జెన్యూన్ కామెడీని పండిస్తూ ప్రేక్షకుల చేత నవ్వులు పూయించాడు. ఈ సినిమాకి ఆయన కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లు చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేసిన ప్రతి మూమెంట్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిందనే చెప్పాలి. ఇక సీనియర్ నరేష్, శ్రీనివాస రెడ్డి, విటివి గణేష్, అనిమల్ ఫేమ్ ఉపేంద్ర లాంటి నటులు చాలా అద్భుతంగా నటించి మెప్పించారనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే భీమ్స్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. ప్రతి సాంగ్ కి కూడా థియేటర్ లో చూస్తున్న ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి చాలా హైలైట్ గా నిలవడం సినిమాకి మొదటి నుంచి చాలా వరకు ప్లస్ అవుతూ వచ్చింది. అలాగే ప్రమోషనల్ వీడియోస్ ద్వారా కూడా ఈ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లారు… ఇక సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి కూడా ఈ సినిమాకి చాలా వరకు మంచి విజువల్స్ అయితే అందించే ప్రయత్నం చేశాడు…
ప్లస్ పాయింట్స్
వెంకటేష్
కామెడీ సీన్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ లేకపోవడం
అక్కడక్కడ రోటీన్ కామెడీ సీన్స్ ఉండటం…