Sankranthiki Vasthunnam
Sankranthiki Vasthunnam Collection: సీనియర్ హీరోలకు, అది కూడా విక్టరీ వెంకటేష్ లాంటి అత్యంత ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలకు పాజిటివ్ టాక్ వస్తే, లాంగ్ రన్ లో నేటి తరం స్టార్ హీరోలకు మించిన వసూళ్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అది ఈ సంక్రాంతికి రుజువు అయ్యింది. ఆయన హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇటీవలే భారీ అంచనా నడుమ విడుదలై మొదటి ఆట నుండే కళ్ళు చెదిరే వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి వారం ఈ చిత్రానికి ఒక్కో సెంటర్ లో వచ్చిన వసూళ్లు చూస్తే, లేటెస్ట్ గా విడుదలైన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా ఆ రేంజ్ వసూళ్లు రాలేదని అనిపిస్తుంది. భవిష్యత్తులో వచ్చే పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఈ సినిమా వసూళ్లు ఒక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు.
5వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. శనివారం కావడంతో నాల్గవ రోజు వచ్చిన వసూళ్ల కంటే 5వ రోజు వచ్చిన వసూళ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక నేడు ఆదివారం అవ్వడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ప్రాంతంలోనూ అదనపు షోస్ ని షెడ్యూల్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రాంతాల వారీగా ఈ సినిమాకి 5 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము. నైజాం ప్రాంతం లో 20 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో 10 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8 కోట్ల 20 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 7 కోట్ల 30 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్లు, గుంటూరు జిల్లాలో 6 కోట్లు, కృష్ణ జిల్లాలో 5 కోట్ల 83 లక్షలు, నెల్లూరు జిల్లాలో 2 కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి 5 రోజులకు గాను 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 40 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. విడుదల తర్వాత వారం రోజులు పూర్తి కాకముందే బయ్యర్స్ కి 37 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ‘గేమ్ చేంజర్’ మిగిలించిన నష్టాలను ఈ చిత్రం పూడ్చేలా చేసింది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ రెండు సినిమాలను ప్రతీ ప్రాంతంలోనూ ఒకే బయ్యర్ కి అమ్మడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. లేకపోతే బయ్యర్స్ మసి అయిపోయేవారు. ఫుల్ రన్ లో ఈ చిత్రం చాలా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.