Sankranthi Movies 2026 Collections Report: ప్రతీ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మూడు నుండి నాలుగు సినిమాలు విడుదల అవ్వడం సర్వ సాధారణం. కానీ ఈ సంక్రాంతి చాలా విభిన్నం. 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ 5 కూడా ఎంటర్టైన్మెంట్ జానర్ లో తెరకెక్కిన సినిమాలే. చిరంజీవి(Megastar Chiranjeevi), ప్రభాస్(Rebel Star Prabhas) వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ చాలా కాలం తర్వాత ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలతో మన ముందుకు వచ్చారు. ఇక నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) గురించి తెలిసిందే, వరుసగా ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలే చేస్తున్నాడు, ఈసారి కూడా అదే జానర్ నే నమ్ముకొని వచ్చాడు. ఇక మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja), శర్వానంద్(Sharwanand) లో కూడా పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసి చాలా రోజులే అయ్యింది. సంక్రాంతి కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసింది. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరెవరు విజేతలుగా నిలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది ఇప్పుడు వివరంగా, కలెక్షన్స్ డేటా తో సహా చూద్దాం.
రాజా సాబ్(The Rajasaab Movie):
వరుసగా పాన్ ఇండియన్ యాక్షన్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలకు పూర్తిగా దూరమైన ప్రభాస్, ఈసారి ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి అభిమానులను ‘రాజా సాబ్’ ద్వారా అలరించాలని అనుకున్నాడు. మొదట్లో ఈ చిత్రం పై అంచనాలు పెద్దగా ఉండేవి కాదు , కానీ రిలీజ్ ట్రైలర్ వేరే లెవెల్ లో ఉండడంతో ఆడియన్స్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి కలిగించి భారీ అంచనాలతో విడుదలైంది. కానీ మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. కానీ ప్రభాస్ కి యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చాయి. కానీ నాల్గవ రోజు నుండి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి 188 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ నుండి కేవలం 96 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 400 కోట్ల గ్రాస్ రావాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం 210 కోట్ల వద్ద ఆగిపోయేలా కనిపిస్తోంది. ఇది ఘోరమైన డిజాస్టర్ అనొచ్చు.
మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu):
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఎంటర్టైన్మెంట్ జానర్ లో కనిపించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. వింటేజ్ మెగాస్టార్ ని చూసుకొని అభిమానులు ఎంతగానో ముసిరిపోయారు. టాక్ ప్రభావం కలెక్షన్స్ పై మామూలు రేంజ్ లో చూపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఈ వీకెండ్ వరకు జరిగాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్. టికెట్స్ కోసం యుద్దాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే మొదటి వారం 240 కోట్లు, ఫుల్ రన్ లో 350 నుండి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మెగాస్టార్ చిరంజీవి కి ఇది నాల్గవ 100 కోట్ల సినిమా.
అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju):
వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి, ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం తో మన ముందుకొచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా, యూత్ ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రమిది. ప్రస్తుతం ఉన్న 5 సినిమాల్లో ఆడియన్స్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తర్వాత ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని చూసేందుకే మొగ్గు చూపిస్తున్నారు. విడుదలైన రెండు రోజుల్లో ఈ చిత్రం 13 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 28 కోట్లు రాబట్టాలి. మొదటి వారం లోనే ఆ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari):
‘శతమానం భవతి’ చిత్రం తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరో శర్వానంద్, తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ నే ఈసారి ఎంచుకొని ‘నారీ నారీ నడుమ మురారి’ తో మన ముందుకొచ్చాడు. సంక్రాంతి బరిలో చివర్లో వచ్చిన సినిమా ఇది. ఆ కారణం చేత థియేటర్స్ చాలా తక్కువ దొరికాయి. రెండు మూడు థియేటర్స్ ఉన్న సెంటర్స్ లో అయితే అసలు విడుదలకు కూడా నోచుకోలేదు ఈ చిత్రం. కానీ సినిమాకు ఆడియన్స్ లో మంచి పాజిటివ్ మౌత్ టాక్ ఉండడం తో కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. కలెక్షన్స్ బాగుండడం, ఆడియన్స్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడడం తో ఈ చిత్రానికి షోస్ బాగా పెంచారు. ఫలితంగా ప్రీమియర్స్ + మొదటి రోజు కి కలిపి ఈ చిత్రం 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 60 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. రాబోయే రోజుల్లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bartha Mahasyulaku Wignapti) :
ధమాకా తర్వాత వరుసగా ఒకటి కాదు , రెండు కాదు, ఏకంగా 7 డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న రవితేజ, ఈసారి కాస్త తన ఇమేజ్ కి భిన్నంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ రవితేజ గత ఫ్లాప్ సినిమాల కారణంగా ఆడియన్స్ ఈ పాజిటివ్ టాక్ ని నమ్మలేదు. దానికి తోడు ఆడియన్స్ చూస్తే ఆ మూడు సినిమాలనే చూడాలి అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. దాని ప్రభావం ఈ చిత్రం పై బలంగా పడింది. 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి రెండు రోజుల్లో కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. మూడవ రోజు సంక్రాంతి కావడంతో అన్ని ప్రాంతాల్లోనూ కలెక్షన్స్ బాగా పెరిగాయి. ఫలితంగా ఈ చిత్రం మూడవ రోజున వరల్డ్ వైడ్ గా కోటి 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 5 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇది ఏ మాత్రం సరిపోదు. ఓవరాల్ గా ఈ చిత్రం ఫ్లాప్ గా మిగిలే అవకాశాలే ఎక్కువ.