Sankranthi 2026 Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోలు చేసే సినిమాలతో వాళ్ల ఇమేజ్ అనేది తార స్థాయికి వెళ్ళిపోతోంది. వాళ్లు ఏ సినిమా చేసిన కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆధరణ అయితే లభిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాళ్ల సినిమాలను సైతం చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి అయితే చూపించడం లేదు. మొదటి రోజు ఏ సినిమా అయితే సక్సెస్ టాక్ తెచ్చుకుంటుందో ఆ సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు…ఇక 2026 సంక్రాంతి కానుకగా ఏ సినిమాలు వస్తున్నాయి. అనేదాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పటివరకు చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు’ అనే సినిమాని సంక్రాంతి కానుక ప్రేక్షక ముందుకు తీసుకొస్తున్నామంటూ ముందుగానే అనౌన్స్ చేశారు.. ఇక దానితోపాటుగా మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాజాసాబ్’ సినిమాని సైతం సంక్రాంతి కానుక ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక వీటితోపాటుగా నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాని కూడా సంక్రాంతి బరిలో దింపుతున్నారు. ఇక వీటితో పాటుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా వస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’ సైతం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక వీటితో పాటుగా శర్వానంద్ హీరోగా వస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాను సైతం సంక్రాంతి బరిలో నిలుపుతున్నారు. ఇవే కాకుండా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమాని సైతం సంక్రాంతి బరిలో నిలుపుతున్నారు. మరి ఇప్పటివరకు 6 సినిమాలు ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాయి.
మరి ఇంకొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నీ అనుకున్న విధంగా సంక్రాంతికి వస్తాయా లేదంటే మధ్యలో పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…