
బాలీవుడ్ లో రూపొందబోతున్న ఒక పాన్ ఇండియా మూవీ కి ఇంకా షూటింగ్ ప్రారంభించక ముందే.. 15 కోట్ల మేర నష్టం వచ్చిందట …ప్రముఖ నిర్మాత , దర్శకుడు అయిన సంజయ్ లీల భన్సాలీ త్వరలో నిర్మించబోయే ఒక చిత్రానికి ముంబై ఫిలిం సిటీ లో సెట్లు వేయడం జరిగింది. కానీ కరోనా దెబ్బకి షూటింగ్ మొదలు కాలేదు దాంతో రెడీ అయిన సెట్లకు స్టూడియో నిర్వాహకులకు రోజువారీ అద్దె చెల్లించాల్సి రావడం సంజయ్ లీలా భన్సాలీ కి పెద్ద భారంగా మారింది .
గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!
ప్రముఖ దర్శక, నిర్మాత మహేష్ భట్ కూతురైన ఆలియా భట్ ఇపుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు తోంది . ప్రస్తుతం అలియా భట్ చేతిలో మూడు హిందీ చిత్రాలు , ఒక తెలుగు చిత్రం ఉన్నాయి. అందులో ఒకటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందే `గంగూబాయి కతియావాడీ ` చిత్రం.. కాగా ఈ చిత్రంలో అలియా భట్ కామటిపురా లో నివసించే వేశ్య గా కనిపించనుంది. దరిమిలా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కామటిపురా ఏరియా సెట్ ని ఫిలిం సిటీ లో వేయడం జరిగింది. ఇక అంతా సిద్దమై షూటింగ్ కి వెళ్ళబోతున్న తరుణం లో లాక్ డౌన్ అడ్డమొచ్చింది. ఆ క్రమంలో స్టూడియో వాళ్లు షూటింగ్ జరిగినా, జరగక పోయినా సెట్ నిమిత్తం భారీ అద్దె వసూల్ చేయడం మొదలెట్టారు. అలా ఊహించని ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డ .సంజయ్ లీల భన్సాలీ స్టూడియో అద్దె చెల్లించడం కంటే సెట్లు కూల్చడమే బెటరనే ఒక నిశ్చయానికి వచ్చాడట …కాగా ఈ ప్రాసెస్ లో సంజయ్ లీల భన్సాలీ. 15 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది ..