Sandeep Vanga and Deepika Padukone : అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)…ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఇక బాలీవుడ్లో ఈ సినిమాని ‘కబీర్ సింగ్’ (kabhir sing) పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత రన్బీర్ కపూర్ (Ranbeer Kapoor) ని హీరోగా పెట్టి చేసిన ‘అనిమల్’ (Animal) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకు మంచి ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ భారీ లెవెల్లో గుర్తింపును సంపాదించుకోవాలని అలాగే ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని కూడా సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజుల నుంచి సందీప్ రెడ్డి వంగ అలాగే దీపిక పదుకొనే మధ్య ఒక ఫైట్ అయితే జరుగుతోంది. దీపికా పదుకొనే కి సందీప్ రెడ్డివంగా స్పిరిట్ సినిమా స్టోరీ చెప్పాడట. మొదట ఆమె ఈ సినిమాలో చేస్తానని చెప్పి ఆ తర్వాత కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది.
ఆ కండిషన్లకి సందీప్ ఒప్పుకోకపోవడంతో తను ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు అలాగే అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన త్రిప్తి డిమ్రి స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది అని సందీప్ రెడ్డి వంగ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఇక దాంతో దీపికా పదుకొనే పిఆర్ టీమ్ రంగంలోకి దిగి స్పిరిట్ సినిమా రొటీన్ గా ఉంది.
అందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అందువల్లే దీపికా పదుకొనే ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆమె 20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ అడగడం లో తప్పేముంది. తను సీనియర్ హీరోయిన్ కాబట్టి తనకు ఆమాత్రం ఇవ్వచ్చు కదా అంటూ తప్పు మొత్తం సందీప్ రెడ్డి వంగ దే అన్నట్టుగా కొన్ని ఆర్టికల్స్ అయితే బయటకు వచ్చాయి.
ఇక దాంతో రెచ్చిపోయిన సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ అయితే చేశాడు… అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పిన కథని నువ్వు ఎక్కడ రివిల్ చేయకూడదు బట్ చేశావు అది కరెక్ట్ కాదు. నా కథని మొత్తం నువ్వు రివీల్ చేసిన కూడా నాకేం ఫరక్ పడదు అంటూ ఆయన స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయం మీద