Spirit Release Date: ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు మాత్రమే కాదు, యావత్తు సినీ అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). సందీప్ వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ప్రభాస్ పై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. శరీరమంతా గాయాలతో ప్లాస్టర్లు వేసుకొని, చేతిలో మందు బాటిల్ పట్టుకొని స్టైల్ గా నిల్చున్న ప్రభాస్ కి, హీరోయిన్ త్రిప్తి దిమిరి సిగెరెట్ తగ్గించే షాట్ ని చూసి ప్రేక్షకులు మెంటలెక్కిపోయారు. రొటీన్ సందీప్ వంగ ట్రేడ్ మార్క్ ఫస్ట్ లుక్ అయినప్పటికీ, ప్రభాస్ ని ఆ యాంగిల్ లో చూసేలోపు అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి.
అది కాసేపు పక్కన పెడితే నేడు సందీప్ వంగ అందరికీ షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తూ ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. అంటే షూటింగ్ ని ఈ ఏడాది లోనే పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ వంగ లాంటోళ్ళు ఇంత వేగంగా సినిమాలు చేస్తే, ఇండియన్ బాక్స్ ఆఫీస్ కాసుల కనకవర్షం తో కళకళలాడుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మార్చ్ 5 న స్పిరిట్ చిత్రం విడుదల అవ్వబోతుండడం తో , ఆ సినిమా విడుదల తేదీ దగ్గర్లో కానీ, విడుదలకు రెండు వారల గ్యాప్ లో కానీ ఏ సినిమా కూడా పోటీ కి రావడం అసాధ్యం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే యూత్ ఆడియన్స్ మొత్తం కనీసం నెల రోజుల పాటు ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ సంక్రాంతి విడుదలైన ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ స్టార్ స్టేటస్ ని చూసి ఆయన్ని ద్వేషించేవాళ్ళు బాగా దిష్టి పెట్టేసారు. అందుకే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఫలితం అందలేదు. రాజా సాబ్ ప్రభాస్ కి ఒక దిష్టి చుక్క లాంటిది. ఈ సినిమా తర్వాత ఆయన సృష్టించబోయే భీభత్సాన్ని చూసి యావత్తు సినీ లోకం నివ్వెరబోతుందని, మొదటి వారం లోపే ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ఫ్యాన్స్. మరి వాళ్ళ నమ్మకాలను ఈ చిత్రం ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి.
Spirit release date 🙂#Spirit pic.twitter.com/PyUrDoxw7d
— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 16, 2026