Spirit : అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నెట్లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)… ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఈ సినిమాలు ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదగడానికి చాలా వరకు హెల్ప్ చేశాయి. ఇక ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న వాళ్ళలో సందీప్ వంగ మొదటి స్థానంలో ఉంటాడు… చాలా తక్కువ సమయంలోనే భారీ గుర్తింపును సంపాదించుకొని తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabhas)… తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో దీపిక పదుకొనే (Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇప్పుడు సందీప్ దీపిక ను పక్కన పెట్టేసి వేరే హీరోయిన్ తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. నిజానికి దీపిక పదుకొనే ఈ సినిమాలో ఉంటే సినిమాకి మంచి హైప్ వస్తుందని చాలామంది ప్రభాస్ అభిమానులు సైతం అభిప్రాయపడ్డారు.
Also Read : ప్రభాస్ స్పిరిట్ ఇప్పుడప్పుడే ఉండదా..?
కానీ దీపిక పదుకొనే పెట్టిన కండిషన్స్ సందీప్ రెడ్డివంగ కి నచ్చకపోవడంతో తనని పక్కన పెట్టిసినట్టుగా తెలుస్తోంది. దీపికా తనకి 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలని, అలాగే లాభాల్లో వాటా ఇవ్వాలని అలాగే స్టోరీ మొత్తం లో ఇబ్బందికరమైన సీన్స్ ఏమైనా ఉంటే తను చేయనని చెప్పడంతో సందీప్ రెడ్డి వంగ కి కోపమొచ్చి ఆమెను పక్కన పెట్టేసి ‘అనిమల్’ (Animal) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి డిమ్రీని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే సందీప్ రెడ్డివంగా దెబ్బకి దీపికా పదుకొనే ఈ సినిమా నుంచి అవుట్ అయిపోయిందనే చెప్పాలి… ఇక త్రిప్తి డిమ్రి (Thripthi Dimri) నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉండవు. కాబట్టి ఆమె ఎలాంటి సీన్స్ లో అయిన నటించడానికి సిద్ధంగా ఉంటుంది.
కాబట్టి తనని ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటికి వచ్చింది…మరి ఈ సినిమాలో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడు తద్వారా సందీప్ రెడ్డివంగాకి ఈ సినిమా ఎలాంటి హైప్ ని తీసుకొస్తుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…