Sandeep Reddy Vanga: ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను చూడడానికి సగటు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు చూసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఒక ఎనిమిది నిమిషాల పాటు ప్రభాస్ ముసలి గెటప్ లో ఉన్న సన్నివేశాలను కలిపి సినిమాని మరోసారి రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికి అది పెద్దగా ప్రేక్షకుడిలో ఇంపాక్ట్ కలిగించకపోవచ్చు. కారణం ఏంటి అంటే మొదట సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్ కి వెళ్లడానికి ఏ ప్రేక్షకుడు కూడా సాహసించడు.
అలాంటప్పుడు ఎలాంటి సన్నివేశాలు కలిపిన సినిమాకి వచ్చే యూజ్ అయితే ఏం ఉండదని మరి కొంతమంది సినిమా మేకర్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ని కలిసి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూనే ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయకండి అంటూ సలహా ఇచ్చాడట…
మీకున్న స్టార్ డమ్ కి ఇలాంటి నాసిరకపు కథలు మీరు ఎంచుకున్నారు అంటే మీ అభిమానులు జీర్ణించుకోలేరు. మీరు ఒక స్టాండర్డ్ లో ముందుకు వెళ్తున్నారు కాబట్టి అదే స్టాండర్డ్ లో సినిమాలను తెరకెక్కిస్తే మంచిది. అలా అయితే వీలైనంత తొందరగా మీరు ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా మారే అవకాశాలైతే ఉంటాయి. మధ్యలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండొచ్చు అంటూ సందీప్ వంగ ప్రభాస్ కి చెప్పేసారట.
దాంతో ప్రభాస్ కూడా రియలైజ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజాసాబ్ సినిమా వల్ల ప్రభాస్ ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అయింది. మారుతి సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో గొప్ప మాటలు చెప్పాడు. కానీ సినిమాలో అంత పెద్ద మ్యాటర్ లేదు అంటూ ప్రభాస్ అభిమానులు మారుతి మీద ఫైర్ అవుతున్నారు…