Sandeep Reddy Vanga Comments On Rajamouli: చాలామంది దర్శకులు సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ డైరెక్టర్లు గొప్ప సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు…ఇక ఇప్పటివరకు రాజమౌళి లాంటి దర్శకుడు చేసిన సినిమాలన్నింటితో మంచి విజయాలను సాధించాడు. ‘బాహుబలి’, ‘ త్రిబుల్ ఆర్’ లాంటి సినిమాలతో ఆయన క్రేజ్ అమాంతం పాన్ ఇండియా స్థాయికి పెంచేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో ఒక క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా బోల్డ్ సినిమాలతో ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించవచ్చు అని నిరూపించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక రీసెంట్ గా ఆయన జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్మూ నిశ్చయమ్మురా’ షోలో ఆర్జీవీతో కలిసి పాల్గొన్నాడు. ఇక అందులో రాజమౌళి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే చెప్పాడు.
బాహుబలి 2 సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పాడు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత తను అర్జున్ రెడ్డి సినిమా కోసం చేసిన ఇంటర్వెల్స్ సీన్ ను చూసుకున్నానని బాహుబలి రేంజ్ లో తన ఇంటర్వెల్ సీన్ లేదు కదా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను అంటూ చెప్పాడు.
మొత్తానికైతే టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఆయన చాలావరకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. మొత్తానికైతే అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం అంటూ ఆయన రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు…
మొత్తానికికైతే రాజమౌళి గురించి సందీప్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…మరి ఈ ఇద్దరు డైరెక్టర్స్ కి ఇండియాలో ప్రస్తుతం మంచి ఫాలోయింగ్ అయితే ఉంది… ఇక సందీప్ ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…