Sandeep Reddy Vanga: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, కేవలం రెండు సినిమాలతోనే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి తరానికి రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు. రాజమౌళి 12 సూపర్ హిట్ సినిమాలను తీసి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు, సందీప్ వంగ కేవలం అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల ద్వారా సంపాదించుకున్నాడు అంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ కి సందీప్ వంగ ఒక రోల్ మోడల్ లాగా మారిపోయాడు. ఇదంతా పక్కన పెడితే సందీప్ వంగ చూసేందుకు చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన మాట్లాడే ప్రతీ మాట పొగరుతోనే మాట్లాడినట్టు ఉంటుంది. ఆడవాళ్ళ ముందు అసలు తగ్గేది లేదు అన్నట్టుగా ఆయన యాటిట్యూడ్ ఉంటుంది. కానీ నిజ జీవితం లో ఈయన కూడా భార్య కు భయపడే భర్త అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.
ఎందుకంటే రీసెంట్ గానే సందీప్ వంగ కి సంబంధించిన ఒక వీడియో విడుదలైంది. ఈ వీడియో లో ఆయన వంట చేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు శుభ్రంగా ఊడవడం , ఇలా ఇంటి పనులన్నీ ఓపిగ్గా చేస్తూ కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎంతో యాటిట్యూడ్ తో మాట్లాడే సందీప్ వంగ నిజ జీవితం లో ఇలా ఉంటాడా అంటూ సోషల్ మీడియా లో ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు. అంత మహాబలుడైన అమ్మవడి పసివాడే అనే లిరిక్ కి తగ్గట్టుగా, ఎంత పెద్ద మగాడు అయినా భార్య వద్ద తలా ఒగ్గాల్సిందే అని అంటున్నారు.
ఇకపోతే సందీప్ వంగ ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా మూవీ టీం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా దానికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ముందు సినిమాల్లో హీరో ని ఎలా అయితే చూపించాడో, అలా ప్రభాస్ ని కూడా చూపించేసరికి ఫ్యాన్స్ ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ త్రిప్తి దిమిరి నటిస్తుండగా , ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు.