Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఇక 1989వ సంవత్సరంలో శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇంపాక్ట్ ను అయితే క్రియేట్ చేశాడో, అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ సైతం అలాంటి ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఒక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్ అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు… రామ్ గోపాల్ వర్మ చేసిన సత్య సినిమాని 30 సార్లు చూశానని చెప్పాడు.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
ఇక ఆ సినిమా చూసిన తర్వాత ఆయన సినిమాల్లోకి రావాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగినట్టుగా చెప్పాడు. ఆ సినిమా వల్లే తను ఇండస్ట్రీకి వచ్చానని, అప్పటి దాకా సినిమాలు మామూలు ప్రేక్షకుడిలా చూసేవాడినని ఆ సినిమా చేశాక సినిమాలు చూసే ధోరణి మొత్తం మారిపోయిందని తద్వారా ఆయన స్టార్ డైరెక్టర్ గా మారడానికి సైతం ఆ సినిమానే కారణమని చెప్పాడు.
ఇక సత్య సినిమా లేకపోతే అర్జున్ రెడ్డి సినిమా కూడా ఉండేది కాదనే విషయాన్ని తను పలు సందర్భాల్లో వివరించడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మాఫియాను సైతం తిప్పుకొడుతూ ఆయన సినిమాలు చేస్తూ మంచి విజయాలను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం వల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది.
ఇక ఇండియాలోనే వన్ అఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి తర్వాత అంతటి గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు కూడా సందీప్ రెడ్డి వంగ నే కావడం విశేషం… ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి రాజమౌళిని బీట్ చేస్తాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి…అలా చేస్తే మాత్రం సందీప్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారుతాడు…