Sandeep Reddy Vanga: హీరో అనే పదానికి పర్ఫెక్ట్ పర్సన్ ప్రభాస్…ఆరడుగుల హైట్, విలన్స్ ను కొట్టగలిగే కండబలం, తెగువతో ముందుకు సాగే పౌరుషం ఉన్న నటుడు ప్రభాస్… అందుకే ఆయన సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ అయితే వచ్చింది. ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. బాహుబలి సినిమాతో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ అప్పటినుంచి ఇప్పటివరకు ఇండియాలో ఉన్న ప్రతి ఒక ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దేశభక్తి తో ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా సందీప్ రెడ్డివంగా ఈ సినిమా కథ గురించి కొన్ని లీక్ లైతే ఇచ్చాడు. బ్రిటిష్ కాలంలో మన దేశ సైనికులు ఎలా పోరాడారు. అందులో పోలీసులు సైతం నీతి నిజాయితీ ధర్మాన్ని కాపాడడానికి ఎలా బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తూ నిలబడ్డారు. అనే ఒక పాయింట్ ను కూడా ఇందులో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇవి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు కావడం తో సినిమా ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో మనకు దేశభక్తి ఉన్న ఒక సిన్సియర్ పోలీస్ గా కనిపించబోతున్నాడట. ఇక తన నిజాయితీతో దేశాన్ని ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ గా తెలుస్తోంది.
ప్రభాస్ నుంచి ఇప్పటి వరకునిమంటి సినిమా రాలేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా డెలివరీ అయితే మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేస్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా పాజిటివ్ వైబ్ తోనే షూటింగ్ అయితే జరుపుకుంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మొత్తానికి సందీప్ తను అనుకున్న రేంజ్ లో సినిమా తెరకెక్కిస్తున్నాడట. బోల్డ్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సందీప్ రెడ్డివంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం విశేషం…
ప్రభాస్ లాంటి హీరోకి పర్ఫెక్ట్ కథతో సినిమా పడితే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తోంది. ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…