Sandeep Reddy Vanga: ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్స్ మధ్య నువ్వా నేనా అంటూ ఎలాంటి పోటీ వాతావరణం ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పాన్ ఇండియన్ డైరెక్టర్స్ కేవలం రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ చుట్టూనే ప్రదిక్షణలు చేస్తున్నారు. అయితే దేశంలో ఉన్న ప్రతీ సూపర్ స్టార్ కొంతమంది స్టార్ డైరెక్టర్స్ తో పని చేయాలని బలంగా కోరుకుంటారు. అలాంటి డైరెక్టర్స్ జాబితాలో సందీప్ వంగ కూడా ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని కొట్టి, అదే సినిమాని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేసి, అక్కడ కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టి, ఆ తర్వాత ‘యానిమల్’ చిత్రంతో పాన్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా సందీప్ వంగ మారిపోయాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈయన సినిమాల్లో హీరోల క్యారెక్టర్లు చాలా వైల్డ్ గా ఉంటాయి. హీరోలను మరో లెవెల్ కి తీసుకెళ్లే క్యారెక్టర్స్ ని డిజైన్ చేయడంలో ప్రస్తుతం సందీప్ వంగ తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ లో మొదలు కాబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ‘యానిమల్’ సినిమా విడుదలకు ముందే సందీప్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుందో ఎవరికీ తెలియదు కానీ, ఆ ప్రాజెక్ట్ అయితే ఆన్ ది ట్రాక్ లో ఉందని మాత్రం చెప్పుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంటే ముందుగా రామ్ చరణ్ తో చేయబోయే సినిమాని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రీసెంట్ గానే సందీప్ వంగ రామ్ చరణ్ ని కలిసి తన దగ్గరున్న ఒక స్టోరీ లైన్ ని వినిపించాడట.
ఈ స్టోరీ లైన్ రామ్ చరణ్ కి విపరీతంగా నచ్చేసింది. ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా, సుకుమార్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. బుచ్చి బాబు తో కమిటైన సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చూస్తున్నారు. ఇక సుకుమార్ సంగతి తెలిసిందే. కనీసం మూడేళ్ళ సమయం తీసుకుంటాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేలోపు సందీప్ వంగ ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ సినిమాలను కూడా పూర్తి చేసేస్తాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా ప్రారంభం కానుంది. అదే విధంగా అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ, అట్లీ, సంజయ్ లీల భన్సాలీ వంటి వారితో సినిమాలున్నాయి. కాబట్టి సందీప్ వంగ, అల్లు అర్జున్ కాంబినేషన్ దగ్గర్లో లేనట్టే. కొన్నేళ్లు ఎదురు చూడక తప్పదు.