Sandeep Reddy Vanga : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక అందులో సందీప్ రెడ్డివంగ ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా భారీ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేసుకుంటుంది. మరి ఈ సినిమా తొందర్లోనే షూటింగ్ స్టార్ట్ చేసి వీలైనంత తొందరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) లాంటి డైరెక్టర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో ఆయన కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన ప్రభాస్(Prabhas)తో స్పిరిట్(Spirit) అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలావరకు ఇబ్బంది పడ్డట్టుగా తెలియజేశాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమా సమయంలో రధన్ (Radhan) తో ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.
కారణం ఏంటి అంటే సందీప్ ఫోన్ చేస్తే రధన్ ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదట…అలాగే సినిమాకు సంబంధించిన వర్క్ ను కూడా తొందరగా ఫినిష్ చేసి ఇవ్వకుండా ఎక్కువ రోజులు గడుపుతూ ఉండేవాడట. అర్జున్ రెడ్డి టీజర్ రిలీజ్ చేసే సమయానికి రధన్ ఇంకా ఒక్క సాంగ్ కూడా కంపోజ్ చేసి ఇవ్వలేకపోయారట. దాంతో ఆయనకు విపరీతమైన కోపం అయితే వచ్చేదట.
ఒకానొక సమయంలో రధన్ సందీప్ తో సాంగ్స్ ఇవ్వు అంటు నువ్వు నన్ను టార్చర్ పెడితే నేను సినిమా చేయకుండా వదిలేస్తాను అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటూ సందీప్ ని బ్లాక్ మెయిల్ కూడా చేసేవారట. ఇక మొత్తానికైతే రధన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందీప్ రెడ్డివంగ రధన్ దొరికితే కొట్టాలి అనేంత కోపం అయితే వచ్చేది. రధన్ దొరికితే కొట్టాలి అనేంత కోపం అయితే వచ్చేదట…
ఇక మొత్తానికైతే వాటన్నింటినీ అనుచుకొని మరి అతని చేత మ్యూజిక్ ని ఇప్పించుకొని మొత్తానికైతే అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక అప్పటినుంచి ఆయన ఫెట్ అయితే మారిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయనను మిగతా దర్శకులందరిలో సపరేట్ చేసి చూపిస్తుంది…