Sandeep Reddy Vanga Chiranjeevi Fan: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ మూవీ తో భారీ సక్సెస్ ను అందుకున్న ఆయన అంబర్ కపూర్ తో ‘అనిమల్’ సినిమా చేశాడు. ఈ మూవీ తో 700 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డివంగ ఒక ఇంటర్వ్యూలో నేను చిరంజీవి అభిమాని చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయి నేను ఇండస్ట్రీకి వచ్చానని పలు సందర్భాల్లో తెలియజేశాడు… నిజానికి చిరంజీవి అంటే తనకు ఎందుకు ఇష్టం అనే విషయాలను కూడా ఆయన పలు సందర్భాల్లో షేర్ చేశాడు.
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
ఆయన సినిమాలను చూస్తున్న క్రమంలో ఇతర హీరోలకు చిరంజీవికి చాలా తేడా ఉండేదని అతని యాక్టింగ్ లో గాని, డ్యాన్స్ లో గాని, ఫైటింగ్ లో గాని చాలా గ్రేస్ ఉండేదని అందువల్లే అనుకోకుండా అందరు అతనికి కనెక్ట్ అయ్యారని అందులో నేను ఒక్కడినే అంటూ ఆయన చెప్పడం విశేషం…ఇక చిరంజీవి లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదని కూడా చెబుతుంటాడు.
ఇక అలాంటి చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నానని కుదిరితే వీలైనంత తొందరగా ఈ సినిమా చేసే అవకాశం ఉందని కూడా చెప్పాడు. ప్రస్తుతం స్పిరిట్ సినిమా మీదనే తను పూర్తి ఫోకస్ ని పెట్టాడు. వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే సందీప్ సైతం ఈ సినిమా కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారట. ఒక డిఫరెంట్ ఇమేజ్ ను ఇవ్వడానికి తనకు పర్ఫెక్ట్ మేకోవర్ ను ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది… తను అనుకున్నట్టుగానే ‘స్పిరిట్’ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలుపుతాడా? ప్రభాస్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…