Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga Spirit Movie: 'దురంధర్ 2' రికార్డులను బ్రేక్ చేయడానికి సందీప్ రెడ్డి...

Sandeep Reddy Vanga Spirit Movie: ‘దురంధర్ 2’ రికార్డులను బ్రేక్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ భారీ ప్లాన్ వేస్తున్నాడుగా…

Sandeep Reddy Vanga Spirit Movie: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా దురంధర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ సైతం ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించి పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు…ఒక్కసారిగా ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాలు డిఫరెంట్ గా ఉండబోతున్నాయి అంటూ ఆయన చాలా క్లారిటీగా చెబుతున్నాడు. ఇక ఈ క్రమంలో తెలుగు సినిమా దర్శకులు సైతం డిఫరెంట్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా సైతం డిఫరెంట్ గా ఉందట. అయితే దురంధర్ సినిమా క్రియేట్ చేయబోతున్న రికార్డ్లను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సందీప్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: హరీష్ శంకర్ డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు చెల్లించాల్సిందేనా…

అయితే ఈ సినిమాని బ్రేక్ చేసి స్పిరిట్ సినిమా భారీ లెవెల్లో సక్సెస్ ని సాధిస్తే సందీప్ రెడ్డివంగ నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా రియలెస్టిక్ గా తెరకెక్కించే ప్రణాళికను చేస్తున్నారట. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో సైతం ప్రభాస్ ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా సినిమా మూడు గంటల నిడివి తో వస్తున్నప్పటికి సినిమాలో ప్రతి సీన్ ను హైలెట్ చేసి చూపించడానికి దర్శకుడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. సందీప్ సినిమా అంటే కొంచెం బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలను భాగం చేస్తున్నాడా?

లేదంటే ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పక్కన పెట్టి ముందుకు సాగుతున్నాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ సినిమాలను చూడడానికి చాలామంది యూత్ తో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ళందరిని సాటిస్ఫై చేసే విధంగా ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మరో సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version