Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ, అట్లీ ఇద్దరిలో ఎవరు గొప్ప డైరెక్టర్ అంటే..?

సందీప్ రెడ్డి వంగ ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ఈయన తీసింది మూడు సినిమాలే అయిన కూడా ఈ మూడు సినిమాల్లో తనదైన రీతిలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుడి అటెన్షన్ ని క్యాప్చర్ చేస్తూ ఎక్కడ లేని విధంగా తనదైన రీతిలో సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

Written By: Gopi, Updated On : December 3, 2023 1:35 pm

Sandeep Reddy Vanga

Follow us on

Sandeep Reddy Vanga: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి ఇప్పటివరకు ఎవరు తీయని రేంజ్ లో కొత్త స్టోరీలను ఎంచుకొని సినిమాలను తీసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీసి సక్సెస్ సాధించి ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన సందీప్ రెడ్డి వంగ గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.

సందీప్ రెడ్డి వంగ ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ఈయన తీసింది మూడు సినిమాలే అయిన కూడా ఈ మూడు సినిమాల్లో తనదైన రీతిలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుడి అటెన్షన్ ని క్యాప్చర్ చేస్తూ ఎక్కడ లేని విధంగా తనదైన రీతిలో సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు…ఇక ఈయన ఇప్పటికే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు…

ఇక ఇది ఇలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ అయిన అట్లీ కూడా మొదటి సినిమా రాజా రాణి నుంచి మొన్న వచ్చిన జవాన్ సినిమా దాకా వరుసగా చాలా మంచి సినిమాలను తీస్తూ మంచి విజయాలను అందుకున్నారు.ఇక ఇప్పుడు అటు సందీప్ రెడ్డి వంగ,ఇటు అట్లీ ఇద్దరిని పోల్చుతూ తెలుగు తమిళ్ ప్రేక్షకులు ఇద్దరిలో ఎవరు గొప్ప డైరెక్టర్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ లను స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే అట్లీ మొత్తం కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాలను అందుకోవడమే అందుకు కారణం…

ఇక సందీప్ రెడ్డి వంగ,అట్లీ ఇద్దరూ కూడా తమదైన రీతిలో ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ స్టైల్ వేరు, అట్లీ స్టైల్ వేరు వీళ్ళిద్దరీ లో ఎవరు గొప్ప అంటే ఎవరు మాత్రం ఏం చెప్తారు. సందీప్ రాసుకున్న కథని వైల్డ్ గా చెప్పడంలో సక్సెస్ అవుతూ ఉంటాడు, అలాగే అట్లీ కూడా తను రాసుకున్న కథని కమర్షియల్ గా చెప్తూ సక్సెస్ కొడుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్లు గా ఎదిగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరి లో ఎవరు గొప్ప అని చెప్పడం కష్టం కానీ ఇద్దరు మంచి డైరెక్టర్లు అని మాత్రం చెప్పవచ్చు…