Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ప్రోమో లు , పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ కి సంబంధించి తాజాగా మరో అప్డేట్ ను మూవీ యూనిట్ అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హీరో రానా సరసన నటించే హీరోయిన్ గురించి చిత్ర బృందం ప్రకటించింది. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ వార్తా గురించే గతం లోనే సంయుత మీనన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినప్పటికీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
We welcome aboard the charming @iamsamyuktha_ to the #BheemlaNayak Family! ♥️@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @sitharaents @adityamusic pic.twitter.com/L0b3x3ZZBf
— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2021
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న సినిమా ను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉండే టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.