Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ” పుష్ప”. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరు కలిసి ఈ మూవీతో ప్రేక్షకులను లరించేందుకు సిద్దమయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. ఈ సినిమా తొలి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ను అనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా పుష్ప మూవీ నుంచి మూడో సింగిల్ ” సామి సామి ” ప్రోమో ను విడుదల చేశారు. పూర్తి పాటను అక్టోబర్ 28 న ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ప్రోమో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ లభించగా… యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో టీజర్లు, పోస్టర్లు జనాల్లో భారీ అంచానలనే పెంచేస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సైతం తన దైన స్టైల్లో ఈ సినిమాకు పని చేస్తున్నారని ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెప్పకనే చెప్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ రీచ్ మామూలుగా లేదు. ఐదు భాషల్లో ఐదుగురితో ఈ పాట పాడించి దేవీశ్రీ సంగీత ప్రియులను అబ్బురపరిచారు.